Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునీతా విలియమ్స్ భూమికిరాక మరింత ఆలస్యం.. ఎందుకో తెలుసా?

ఠాగూర్
గురువారం, 13 మార్చి 2025 (10:30 IST)
భారత సంతతికి చెందిన ఇండో-యూఎస్ వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి చేరుకోవడానికి మరింతకాలం పట్టేలావుంది. ఆమెను తీసుకొచ్చేందుకు సిద్ధమైన ఫాల్కన్ 9 రాకెట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ కారణంగా క్రూ 10 మిషన్ ప్రయోగం నిలిచిపోయింది. హైడ్రాలిక్ సిస్టంలో సమస్య కనిపించడంతో ప్రయోగాన్ని నిలిపివేసినట్టు నాసా ప్రకటించింది. సమస్యను పరిష్కరించి మరో వారం రోజుల్లో ప్రయోగం చేపడతామని వెల్లడించింది. 
 
ఫాల్కన్ 9 రాకెట్ క్రూ 10 మిషన్‌లో నలుగురు వ్యోమగాములు అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటారు. వీరు అక్కడ ఉండి, అక్కడ చిక్కుకునివున్న సునీత విలియమ్స్, బచ్ విల్‌మోర్‌లను భూమికి పంపుతారు. నిజానికి క్రూ 10 అంతరిక్ష నౌక నిన్ననే అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం కావాల్సివుంది. 19న వారు భూమిపైకి రావాల్సి వుంది. అయితే, తాజాగా సాంకేతిక సమస్య తలెత్తడంతో వారిరాక మరిన్ని రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. 
 
కాగా, అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో వారం రోజుల ప్రయోగాల నిమిత్తం సునీతా విలియమ్స్, బచ్ విల్‌మోర్ గత యేడాది జూన్ నెల 5వ తేదీన స్టార్ లైనర్‌లో ఐఎస్ఎస్‌కు చేరుకున్నారు. అప్పటి నుంచి వారు అక్కడే ఉంటున్నారు. వారిని భూమిమీదికి తీసుకొచ్చేందుకు ఇప్పటివరకు చేసిన పలు ప్రయత్నాలు విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా క్రూ 10 అంతరిక్ష నౌకను సిద్ధం చేయగా, చివరి నిమిషంలో అందులో కూడా సాంకేతిక సమస్య తలెత్తింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments