Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగోలో అంతుచిక్కని వ్యాధి.. 143 మంది మృతి.. పిల్లలే అధిక బాధితులా?

ఠాగూర్
మంగళవారం, 10 డిశెంబరు 2024 (16:44 IST)
ఆఫ్రికా దేశాల్లో ఒకటైన కాంగోలో అంతు చిక్కని వ్యాధి ప్రజలను వణికిస్తుంది. ఈ వ్యాధి సోకి ఇప్పటికే 143 మంది మృతి చెందారు. పైగా, ఈ వ్యాధి చిన్నారులకు అధికంగా సోకుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు చనిపోయినవారిలో ఐదేళ్ల లోపు చిన్నారుల సంఖ్యే అధికంగా ఉంది. వ్యాధి ఎందుకు, ఎలా సోకుతుందనే వివరాలను వైద్యుల కూడా తెలియడం లేదు. ఈ మిస్టరీ వ్యాధిని వారు డీసీజ్ ఎక్స్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కాంగోలోని క్వాంగో ప్రావిన్స్‌లో డిసీజ్ ఎక్స్ కేసులో 406 నమోదయ్యాయని అధికారులు తెలిపారు.
 
ఈ అంతు చిక్కని వ్యాధితో ఆస్పత్రితో చేరకుండానే మరికొందరు చనిపోయి ఉండొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కాంగోలో పేదరికం కారణంగా పిల్లల్లో పౌష్టికాహార లోపం సర్వసాధారణమని గుర్తుచేశారు. ఈ కారణంగానే డిసీస్ ఎక్స్ ఎక్కడ మొదలైంది, ఎలా వ్యాపిస్తుందనే వివరాలు గుర్తించడం సమస్యగా మారిందని ప్రపంచ ఆరోగ్యం సంస్థ నిపుణులు వివరించారు. 
 
ఈ వ్యాధిపై పరిశోధన కోసం నిపుణుల బృందాలను కాంగోకు పంపించామని, వ్యాధి ప్రబలుతున్న ప్రాంతాల్లో రోగుల నుంచి నమూనాలను సేకరించి విశ్లేషిస్తున్నామని ఆరోగ్య సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. వ్యాధి మూలాలను, కారకాలను గుర్తించి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపింది. 
 
ఈ వ్యాధి సోకినవారు జ్వరం, ఒళ్లు నొప్పు, తలనొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే, జలుబుతో ముక్కు కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తహీనత వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Soundarya House: సౌందర్య ఇంటి కోసమే.. మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయా?

మంచు ఫ్యామిలీ వివాదంలోకి నా కుమార్తెను కూడా లాగారు : మంచు మనోజ్

మనోజ్ - మౌనికల నుంచి ముప్పు వుంది.. పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు

జయసుధ మూడో పెళ్లి చేసుకుందా.. విదేశాల్లో ఎంజాయ్ చేస్తుందా?

ఆస్తి కోసం కాదు.. ఆత్మగౌరవం కోసం ఈ పోరాటం : మంచు మనోజ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ponnaganti : పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే?

winter health కండరాలు నొప్పులు, పట్టేయడం ఎందుకు?

తరచూ జలుబు చేయడం వెనుక 7 కారణాలు

Black Tea బ్లాక్ టీ తాగితే 6 ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

స్పైనల్ మస్కులర్ అట్రోఫీ లక్షణాలను ఎదుర్కోడానికి అవగాహన అవసరం అంటున్న నిపుణులు

తర్వాతి కథనం
Show comments