Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రీ శవం వద్ద మోడల్ సెక్సీ ఫోటోషూట్!

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (08:47 IST)
సాధారణంగా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా భౌతికంగా దూరమైతే ఆ ఇంట్లో విషాదం నెలకొంటుంది. అదీకూడా కన్నతండ్రి చనిపోతే చెప్పనక్కర్లేదు. తండ్రిని తలుచుకొని ఏడుస్తూ, తల్లిని, తోబుట్టువులను ఓదారుస్తూ ఉంటుంది. 
 
కానీ, ఇక్కడ మనం చెప్పుకోబోయే ఒక యువతి మాత్రం అందుకు విరుద్ధం. తండ్రి చనిపోయాడనే బాధే లేకుండా.. అతని మృతదేహం వద్ద సెక్సీ ఫోటోషూట్ చేసింది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెద్ద ఘన కార్యం చేసినట్లు పోస్ట్ చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా విమర్శల పాలయ్యింది. ఈ ఘటన అమెరికాలో వెలుగు చూసింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మియామీ సిటీకి చెందిన జేన్ రివేరా ఒక టిక్ టాక్ స్టార్‌గా గుర్తింపు పొందారు. ఈమెకు కొద్దిగా పేరు ప్రఖ్యాలు, గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలో ఇటీవల ఆమె తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు. ఉన్నంతలోనే అంత్యక్రియలు నిర్వహించారు. ఇంతవరకు బాగానేవుంది. 
 
అయితే, ఈ యువతి మాత్రం తన తండ్రి చావును పబ్లిసిటీ స్టంట్‌గా వాడుకుంది. తండ్రి మృతదేహాన్ని పక్కన పెట్టుకొని సెక్సీ పోజులతో ఫోటోలకు రెడీ అయిపోయింది. అదేదో సినిమా, యాడ్ షూట్ లా తండ్రి శవం పక్కన నవ్వుతూ నిలబడింది. అంతేకాకుండా ఆ ఫోటోలను షేర్ చేస్తూ 'నా సీతాకోక చిలుక ఎగిరిపోతుంది.. నీ ఆత్మకు శాంతి కలగాలి నాన్నా.. రెస్ట్ ఇన్ పీస్' అంటూ పోస్ట్ చేసింది. 
 
మిగతా విషయాలలో అమ్మడిని సపోర్ట్ చేసిన ఆమె ఫాలోవర్స్ .. ఈ విషయంలో మాత్రం విమర్శలు చేస్తున్నారు. ఇంత బాధలో ఉన్నా కూడా నీకు ఫోటో షూట్ అవసరమా..? అని కొందరు.. మరి దారుణం ఇది అని మరికొందరు ఆమెను విమర్శిస్తున్నారు. ఇవేమి పట్టించుకోని జేన్ .. నేను చేసిన దానిలో తప్పేముంది అంటూ ఎదురు ప్రశ్నించడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం