Webdunia - Bharat's app for daily news and videos

Install App

చల్లారని పెట్రో మంట : తాజాగా 35 పైసలు వడ్డన

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (08:24 IST)
దేశంలో పెట్రో మంట ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. గత నెల చివరి వారం నుంచి వరుసగా పెరుగుతున్న చమురు ధరలతో సామాన్యుడి బతుకు భారమవుతుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ప్రతిరోజూ మారుతుండటంతో నిత్యావసరాల ధరలు కూడా మండిపోతున్నాయి. ఒకవైపు పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నా.. మరోవైపు సాధారణ ప్రజానీకం గగ్గోలు పెడుతున్నా ఆయిల్ కంపెనీలతో పాటు.. కేంద్రం మాత్రం తమకేం పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయి. 
 
ఇప్పటికే రికార్డు స్థాయిలో కొనసాగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను మరోసారి 35 పైసల చొప్పున పెంచాయి. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.108.29, డీజిల్‌ ధర రూ.97.02కు చేరాయి. 
 
ఇక ముంబైలో పెట్రల్‌ రూ.114.14, డీజిల్‌ రూ.105.12కు చేరగా, చెన్నైలో పెట్రోల్‌ రూ.105.13, డీజిల్‌ రూ.101.25, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.108.78, డీజిల్‌ రూ.100.14కు చేరాయి.
 
తాజా పెంపుతో లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై 36 పైసలు, 38 పైసల చొప్పున అధికమయ్యాయి. దీంతో హైదరాబాద్‌లో లీటరు డీజిల్‌ ధర రూ.105.84, పెట్రోల్‌ రూ.112.63కు పెరిగింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments