Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొరుగింట మహిళతో అక్రమ సంబంధం... ఆమెను కలిసేందుకు సొరంగం!

Webdunia
మంగళవారం, 5 జనవరి 2021 (12:18 IST)
కరోనా లాక్డౌన్ కష్టకాలంలో ప్రేమికుల పాట్లు అన్నీఇన్నీకావు. లాక్డౌన్ సమయంలో తమ ఇళ్ళకే పరిమితమైన ప్రేమికులు... ఒంటరిగా విరహ వేదన అనుభవించలేకపోయారు. ఈ క్రమంలో పొరుగింటి మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి ఆమెను రహస్యంగా కలిసేందుకు ఏకంగా ఆమె ఇంటి వద్దకు సొరంగం తవ్వాడు. ఈ ఘటన మెక్సికోలోని టిజువానాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, టిజువానాకు చెందిన అల్బెర్టో అనే భవన నిర్మాణ కార్మికుడికి తన పొరుగింటి మహిళ పమెలాతో వివాహేతర సంబంధం ఉంది. పమెలా భర్త జోర్గే ఉద్యోగానికి వెళ్లగానే అల్బెర్ట్‌ ఆమె ఇంట్లో వాలిపోయేవాడు. 
 
ఇలా రోజూ వెళ్తే చుట్టుపక్కల వాళ్లకు అనుమానం వస్తుందనో ఏమో.. తన ఇంటి నుంచి ఆమె ఇంటికి ఒక సొరంగాన్ని తవ్వి దాంట్లోంచి వెళ్లడం ప్రారంభించాడు. ఒకరోజు జోర్గే.. రోజూ కన్నా ముందుగా ఇంటికి వచ్చేసరికి.. పమెలా, అల్బెర్ట్‌ల నిర్వాకం అతడి కంటపడింది.
 
జోర్గేను చూడగానే భయంతో సోఫా వెనక నక్కిన అల్బెర్ట్‌.. అక్కడ ఉన్న సొరంగం గుండా తన ఇంట్లోకి వెళ్లిపోయాడు. అతడు సోఫా వెనుక దాక్కోవడాన్ని కళ్లారా చూసిన జోర్గే.. అంతలోనే అతడు మాయం కావడంతో అనుమానం వచ్చి గాలించడంతో సొరంగం బయటపడింది. దాంట్లోంచి వెళ్లగా అల్బెర్టో ఇంట్లో తేలాడతను. 
 
అప్పటికే అక్కడ ఉన్న అల్బెర్టో.. 'నా భార్య నిద్రపోతోంది. గట్టిగా గొడవ చేస్తే నా గురించి ఆమెకు తెలిసిపోతుంది' అంటూ పమెలా భర్త కాళ్లు పట్టుకున్నంత పని చేశాడు. కానీ, కోపంతో రగిలిపోతున్న పమెలా భర్త పెద్దగా అరిచి గొడవ చేయడం విషయం చుట్టుపక్కలవారందరికీ.. ఆపై ప్రపంచం మొత్తానికీ తెలిసిపోయింది. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అల్బెర్ట్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anjali: అంజలి లీడ్ రోల్ లో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల చిత్రం

అఖండ2 కి నందమూరి బాలకృష్ణ డబ్బింగ్ పూర్తి చేశారు

గర్భవతి అని తెలిసినా ఆ నిర్మాత వదిలిపెట్టలేదు : రాధిక ఆప్టే

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

తర్వాతి కథనం
Show comments