Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ - చైనా మీడియా వార్ : ఇండియన్ జర్నలిస్టులంతా దేశం వీడాల్సిందే..

Webdunia
మంగళవారం, 13 జూన్ 2023 (10:50 IST)
భారత్ - చైనా దేశాల మధ్య మీడియా వార్ మొదలైంది. భారతీయ జర్నలిస్టులంతా తమ దేశం వీడాలని చైనా హుకుం జారీచేసింది. కావాలని కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా మరోసారి తన బుద్ధి చాటుకుంది. సరిహదుల్లో భారత్‌తో గిల్లికజ్జాలు పెట్టుకునే డ్రాగన్ ఈసారి మీడియాను లక్ష్యంగా చేసుకుంది. కొన్ని నెలల కిందట మన మీడియా ప్రతినిధులకు ముగ్గురు సహాయకులే ఉండాలంటూ పరిమితి విధించిన బీజింగ్.. ఇప్పుడు అక్కడ పనిచేస్తున్న ఏకైక భారతీయ జర్నలిస్టును జూన్ నెలాఖరులోగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. 
 
కొద్దిరోజుల క్రితం జిన్హువా, చైనా సెంట్రల్ టీవీ జర్నలిస్టుల వీసా పొడిగింపును భారత్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో మన జర్నలిస్టులకు సహాయకుల సంఖ్యపై పరిమితి పెట్టిన డ్రాగన్, వారిని తామే ఎంపిక చేసి ఇస్తామని ప్రకటించింది. ఇప్పుడు భారతీయ జర్నలిస్టును వెళ్లిపోవాలని ఆదేశించింది. కాగా, చైనా ఆదేశాలతో ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) విలేకరి త్వరలో వచ్చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. 
 
ఈ ఏడాది ప్రారంభం వరకు చైనాలో నలుగురు భారత జర్నలిస్టులు ఉండేవారు. హిందూస్థాన్ టైమ్స్ జర్నలిస్టు గత వారాంతంలో వచ్చేశారు. ప్రసారభారతి, హిందూ పత్రిక జర్నలిస్టులకు ఏప్రిల్లో వీసాలను పునరుద్ధరించలేదు. పీటీఐ ప్రతినిధిని కూడా వెళ్లిపోవాలని కోరడంతో పొరుగు దేశంలో మన జర్నలిస్టులు ఎవరూ లేనట్లవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments