Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్రరాజ్యంలో మళ్లీ పేలిన తూటా... ఓ మహిళ - బాబు మృతి

Webdunia
శుక్రవారం, 11 జూన్ 2021 (16:39 IST)
అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ తూటా పేలింది. గురువారం జరిగిన ఈ కాల్పుల్లో ఓ మహిళతోపాటు ఏడాది బాబు ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అమెరికా, ఫ్లోరిడాలోని రాయల్ పామ్ బీచ్‌లో ఉన్న పబ్లిక్స్ గ్రోసరీ స్టోర్‌లో గురువారం రోజు ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. 
 
ఈ దాడిలో వృద్ధ మహిళ సహా ఏడాది వయసున్న ఆమె మనవడు తీవ్రంగా గాయపడ్డి ప్రాణాలు కోల్పోయారు. అనంతరం కాల్పులకు పాల్పడ్డ సదరు దుండగుడు సైతం తనను తాను కాల్చుకుని మరణించాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 
 
ఈ కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దుండగుడు ఏ కారణం చేత కాల్పులకు పాల్పడ్డాడనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇదిలావుంటే, ఫ్లోరిడాలో గత ఆదివారం కూడా ఓ దుండగుడు కాల్పులకు తెలగబడిన విషయం తెల్సిందే. మియామిలోని జరిగే గ్రాడ్యూయేషన్ పార్టీలో ఓ దుండగుడు కాల్పులు జరపడంతో ముగ్గరు మరణించగా.. ఐదుగురు గాయపడిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments