Webdunia - Bharat's app for daily news and videos

Install App

జొమోటోకు తర్వాత ఉబెర్ ఈట్స్.. ఆహారం ఆర్డరిస్తే.. మురికి అండర్‌వేర్ వచ్చింది..

Webdunia
బుధవారం, 12 డిశెంబరు 2018 (17:44 IST)
ఫ్లోరిడాలో చీదరించుకునే ఘటన చోటుచేసుకుంది. నిన్నటికి నిన్న జొమోటో ఆన్‌లైన్ డెలివరీ సంస్థకు చెందిన డెలివరీ బాయ్ కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్‌ను టేస్టు చేసి ఆపై డెలివరీ చేసిన నేపథ్యంలో.. ఫ్లోరిడాలో ఆహారం ఆర్డర్ చేస్తే ఉబెర్ ఈట్స్ సంస్థ ద్వారా ఓ కస్టమర్ మురికి అండర్ వేర్‌ను ఆర్డర్‌గా అందుకుని షాక్ అయ్యాడు. ఈ ఘటన ఫ్లోరిడాలోని మియామీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఆదివారం రాత్రి లియో అనే వ్యక్తి ఉబెర్ ఈట్స్ ద్వారా ఆన్‌లైన్‌ (జపనీస్ రెస్టారెంట్ ద్వారా)లో ఆహారం ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ రానే వచ్చింది. ఉబెర్ ఈట్స్ డ్రైవర్ వద్దకెళ్లి ఆర్డరిచ్చిన ఫుడ్‌ను లియో తీసుకున్నాడు. గదిలోకి వచ్చి ఆ ఆర్డర్‌ను విప్పి చూసి షాకయ్యాడు. ఫుడ్ ఆర్డర్ ఇస్తే ఆ ప్యాకెట్‌లో మల విసర్జనతో కూడిన అండర్ వేర్ వుండటంతో దాన్ని విసిరిపడేశాడు. కోపంతో ఉబెర్ డ్రైవర్‌కు, పోలీసులకు కాల్ చేశాడు. 
 
దీనిపై లియో మాట్లాడుతూ.. ఎవరైనా మురికి లోదుస్తులను పంపిణీ చేస్తారని భావించగలమా అని ప్రశ్నించాడు. ఇది అసహ్యించుకునే చర్య అని.. ఇలాంటి ఘటనలు ప్రమాదకరమని చెప్పుకొచ్చాడు. ఈ ఘటనపై ఉబెర్ సంస్థ విచారిస్తున్నట్లు తెలిపింది. లియో ఆర్డర్ ఇచ్చిన పైసలను తిరిగి పుచ్చుకున్నా ఇలాంటి చీదరించుకునే ఘటనను జీవితంలో మరిచిపోనని చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments