Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈశాన్య మయన్మార్‌లో భూకంపం.. భయాందోళనలో ప్రజలు

Webdunia
శనివారం, 18 నవంబరు 2023 (10:42 IST)
ఈశాన్య మయన్మార్‌లో శుక్రవారం భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రవతతో నమోదైనట్టుగా యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంప కేంద్రాన్ని పది కిలోమీటర్ల లోతులో గుర్తించారు. ఈశాన్య మయన్మార్‌లోని కెంగ్ తుంగ్ సిటీ వణికిపోయింది. ఒక్కసారిగా భారీ ప్రకంపనలు సంభవించడంతో ఆ ప్రాంత ప్రజలు భయంతో వణికిపోయారు. 
 
భూకంపం వచ్చిన ఈ ప్రాంతం చైనా, లావోస్, థాయ్‌లాండ్ సరిహద్దు ప్రాంతాలకు సమీపంలో ఉంది. ఈ ప్రకంపనల తీవ్ర థాయ్‌లాండ్‌లోని రెండో అతిపెద్ద నగరం, ప్రముఖ పర్యాటక కేంద్రం చియాంగ్‌ మాయిలోనూ కనిపించాయి. కాగా, మయన్మార్‌లో భూకంపాలు సర్వసాధారణమైన విషయం తెల్సిందే. అయితే, తాజాగా సంభవించిన భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి లేదా ప్రాణనష్టం వాటిల్లలేదని స్థానిక అధికార యంత్రాంగం తెలిపింది. 
 
ఉత్తరాఖండ్‌లో ఘోరం.. ఆ రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు - 13 మంది మృతి
 
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ వాహనం లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది మృత్యువాతపడ్డారు. అలాగే, గుజరాత్ రాష్ట్రంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడం వల్ల మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. శనివారం జరిగిన ఈ రెండు ప్రమాదాల్లో 13 మంది చనిపోయారు. 
 
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనితాల్ జిల్లాలో ద్విచక్రవాహనాన్ని తప్పించబోయిన ఓ పికప్ వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న వారిలో 8 మంది చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు ఘటనా స్థలంలోనే చనిపోగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. 
 
కొందరు ప్రయాణికులతో పికప్ వ్యాన్ హల్ద్వానీ ప్రాంతం వైపు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. చీరాఖాన్ - రీతా సాహిహ్ మోటార్ రోడ్డులో ప్రయాణిస్తుండగా, వ్యాన్ డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పి 500 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ప్రమాదం జరిగిన క్షణాల్లోనే అందులోని ప్రయాణికుల అరుపులు విన్న చుట్టుపక్కల గ్రామస్థలు ఘటనాస్థలికి చేరుకోన్నారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments