అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా కన్ను.. కామెంగ్ నదిలో కరిగే వ్యర్థాలు

Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (15:47 IST)
fish
భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా ఎప్పటి నుంచో కన్నేసింది. ఎలాగైనా ఆ రాష్ట్రాన్ని తన దేశంలో కలిపేసుకొవాలని చూస్తున్నది. లద్దాఖ్ లో కిరికిరి చేస్తూనే, చైనా అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్‌లో బలగాలను మొహరిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. 
 
అయితే, చైనా ఇప్పుడు కొత్త ఎత్తులు వేస్తుంది. చైనా నుంచి ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించే నదులను కలుషితం చేస్తుంది. దీనివలన నదులు నల్లగా మారిపోతున్నాయి. అందులో నివసించే చేపలు, ఇతర జీవులకు ఆక్సీజన్ అందక వేల సంఖ్యలో మరణిస్తున్నాయి.
 
చైనా బోర్డర్‌లో పెద్ద ఎత్తున కట్టడాలను నిర్మిస్తుంది. ఈ కట్టడాల వ్యర్థాలను నదిలో కామెంగ్ నదిలో కలిపేస్తుంది. ఫలితంగా నదిలోని నీరు మొత్తం నల్లగా మారిపోయింది. సాధారణంగా లీటర్ నీటిలో కరిగే వ్యర్థాల పరిమాణం 300 మిల్లీ గ్రాముల నుంచి 1200 మిల్లీ గ్రాముల వరకు ఉండవచ్చు. 
 
కానీ, కామెంగ్ నదిలో కరిగే వ్యర్థాలు 6800 మిల్లీ గ్రాముల వరకు ఉంటోంది. దీంతో నది మొత్తం నల్లగా మారిపోయి దేనికి పనికి రాకుండా పోతుంది. ఎగువ ప్రాంతంలో చైనా కట్టడాలు నిర్మిస్తూ వాటి వ్యర్థాలను పెద్ద సంఖ్యలో కామెంగ్ నదిలో కలిపేస్తుందని అధికారులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments