Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిఫ్టులో వృద్ధురాలిని అలా కాపాడిన యువతి.. పసిబిడ్డ ఏడుస్తున్నా..? (video)

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2020 (13:32 IST)
Heart attack
లిఫ్టులో ఓ వృద్ధురాలిని కాపాడి శభాష్ అనిపించుకుంది.. ఓ యువతి. ఈ ఘటన వాయువ్య చైనాలోని జున్యాంగ్ కౌంటీలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఆ యువతిపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. అపార్టుమెంటులోని లిఫ్టులో ఓ వృద్ధురాలు గుండెపోటుతో అక్కడే కుప్పకూలిపోయింది. ఆ సమయంలో ఆ లిఫ్టులో ఆమె ఒక్కతే ఉంది. కాసేపటికి లిఫ్టు తెరుచుకున్నాక బయటి నుంచి లిఫ్టులోకి వచ్చిన ఓ యువతి ఆ వృద్ధురాలిని చూసింది. అంతే, ఆమెను కాపాడడమే లక్ష్యంగా ఆ యువతి తన పసిబిడ్డను లిఫ్టు బయట పడుకోబెట్టి వచ్చేసింది.
 
ఆ వృద్ధురాలి గుండె పంపింగ్ తగ్గిపోవడంతో ఆమె దాన్ని సరిచేసుందుకు ప్రథమ చికిత్స అందించింది. తన పసిబిడ్డ లిఫ్టు బయట ఏడుస్తున్నప్పటికీ వృద్ధురాలిని బతికించేందుకు ఆమె ఆరాట పడి, చివరకు ఆమె ప్రాణాలను కాపాడింది. ఆ సమయంలో ఆ వృద్ధురాలిని కాపాడడమే తనకు ముఖ్యంగా అనిపించిందని ఆ యువతి చెప్పింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments