Webdunia - Bharat's app for daily news and videos

Install App

లడాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించం : తేల్చి చెప్పిన చైనా!

Webdunia
బుధవారం, 14 అక్టోబరు 2020 (14:07 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని లడాఖ్ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం గత యేడాది ప్రకటించింది. అప్పటి నుంచి అటు పాకిస్థాన్, ఇటు చైనాలు ఏదో విధంగా ఉద్రిక్త వాతావరణం సృష్టించేందుకు కుయుక్తులు పన్నుతూనే ఉన్నాయి. తాజాగా చైనా చేసిన ప్రకటన భారత్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ల‌డాఖ్ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతం గుర్తించ‌మ‌ని చైనా వెల్ల‌డించింది. అక్ర‌మ రీతిలో భార‌త ప్ర‌భుత్వం ల‌డాఖ్‌ను యూటీగా చేసిన‌ట్లు చైనా ఆరోపించింది.
 
ఇటీవలి కాలంలో భారత్ - చైనా దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనివున్న నేపథ్యంలో డ్రాగన్ కంట్రీ చేసిన ప్రకటన ఇపుడు పుండుమీద కారం చల్లినట్టేనని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయడుతున్నారు. గ‌త కొన్ని నెల‌ల నుంచి ఆ ప్రాంతంలో యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొంది. జూన్ 15వ తేదీన వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది భార‌తీయ జ‌వాన్లు కూడా ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. 
 
అప్పటి నుంచి దశలవారీగా బలగాలను తరలిస్తూ వచ్చిన చైనా.. ప్రస్తుతం ఏకంగా 60 వేల మంది బలగాలను సరిహద్దుల వెంబడి మొహరించిందని అమెరికా మంత్రి పాంపియో వెల్ల‌డించారు. ల‌డాఖ్ స‌రిహ‌ద్దుల్లో ఉన్న టెన్ష‌న్ వాతావ‌ర‌ణాన్ని త‌గ్గించేందుకు ఇటీవ‌ల రెండు దేశాల‌కు చెందిన సైనిక‌, దౌత్య అధికారులు చ‌ర్చ‌లు కూడా నిర్వ‌హించారు. కానీ ఇంకా స‌మ‌స్య కొలిక్కిరాలేదు. అయితే తాజాగా ల‌డాఖ్‌ను యూటీగా గుర్తించ‌మ‌ని చైనా ప్ర‌క‌ట‌న చేయ‌డం గ‌మ‌నార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balagam Actor: బలగం నటుడు మొగిలయ్య కన్నుమూత

పోలీస్ ట్రైనీ మీనాక్షితో వెంకటేష్ ప్రేమలో పడితే ఏం జరిగింది?

Keerthy Suresh mangalsutra: మంగళసూత్రంతో కీర్తి సురేష్.. ఎరుపు రంగు దుస్తుల్లో అదిరిపోయింది...

Pushpa 2 Collection: రూ: 1500 కోట్లకు చేరువలో పుష్ప-2

ఓజీలో ఐటెం సాంగ్ కు సిద్ధమవుతున్న నేహాశెట్టి !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments