Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేటింగ్ పేరుతో దగా.. సైబర్ చీటర్ల ఆటకట్టించిన పోలీసులు

Webdunia
బుధవారం, 14 అక్టోబరు 2020 (14:00 IST)
డేటింగ్ పేరుతో దగా చేస్తున్న సైబర్ చీటర్ల ఆటలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కట్టించారు. ఈ దందాలో భాగస్వామ్యం ఉన్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. జాయింట్‌ సీపీ అవినాష్‌ మహంతి కథనం ప్రకారం.. కోల్‌కతా జోదాపూర్‌ గార్డెన్‌ సమీపంలో ఏకే రిచార్జి పేరుతో ఆనంద్‌కర్‌ ఓ కాల్‌ సెంటర్‌ను, ఇదే పేరుతో దానికి సమీపంలో మరో కాల్‌సెంటర్‌ను కూడా నడుపుతున్నడు..  
 
బయట రిచార్జి బోర్డులుండగా.. లోపల మాత్రం 20 మంది మహిళలతో కాల్‌సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. ఒక కేంద్రాన్ని ఆనంద్‌కర్‌, మరో కేంద్రాన్ని బుద్ధదేవ్‌ పౌల్‌ పర్యవేక్షిస్తూ కాల్ సెంటర్‌ను నిర్వహించసాగారు. అయితే, బల్క్‌లో ఫోన్‌ నంబర్లు సేకరించి, కాల్‌ సెంటర్‌లో పనిచేసే యువతులతో బల్క్‌ ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తుంటారు. 
 
మరికొందరు డేటింగ్‌ యాప్స్‌లో బాధితులను సంప్రదిస్తూ డేటింగ్‌ పేరుతో చాటింగ్‌ చేస్తుంటారు. ఫోన్లలో బల్క్‌ ఎస్‌ఎంఎస్‌లు పంపించడంతో, అందులో స్పందించిన వారితో రిజిస్ట్రేషన్‌ ఫీజంటూ రూ.2 వేలు వసూలు చేస్తారు. ఆ తర్వాత అందమైన మహిళల ఫొటోలు పంపించి, వాటికి కొంత మొత్తం, వాళ్లతో డేటింగ్‌ అంటూ మరికొంత, వాళ్లకు హోటల్‌ గదిలో రూమ్‌ బుక్‌ చేయలంటూ మరికొంత... ఇలా అందిన కాడికి దోచేస్తారు. 
 
దాంతో పాటు వీళ్లను నమ్మి సభ్యత్వం తీసుకున్న వారి వద్ద నుంచి గోల్డెన్‌ మెంబర్‌ షిప్‌, ప్లాటినం మెంబర్‌ షిప్‌ అంటూ అదనంగా వసూలు చేస్తారు. బాధితుల నుంచి ఎంత వీలైతే అంత వసూలు చేయడం ఈ కాల్‌సెంటర్లలో పనిచేసే యువతుల పని. 
 
ఇదిలావుంటే, హైదరాబాద్‌కు చెందిన ఓ బాధితుడు జనవరిలో డేటింగ్‌ యాప్‌లో సంప్రదించాడు. ఇలా సంప్రదించిన బాధితుడితో అందమైన అమ్మాయిలతో డేటింగ్‌ చేయిస్తామంటూ నమ్మించి రూ.48 వేలు వసూలు చేశారు. సభ్యత్వం కార్డు కోసం అంటూ డబ్బులు అడుగుతుండటంతో ఇదంతా మోసమని గుర్తించి సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు జనవరిలో ఫిర్యాదు చేశాడు. 
 
ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌ బృందం ఈ కేసు దర్యాప్తు చేపట్టింది. బాధితుడు డబ్బులు డిపాజిట్‌ చేసిన ఖాతాలు, సెల్‌ఫోన్ల ఆధారంగా ఇదంతా కోల్‌కతా కేంద్రంగా జరుగుతుందని గుర్తించి, ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లింది. అక్కడ ఆనంద్‌ కర్‌, బుద్ధదేవ్‌లు నిర్వహిస్తున్న కాల్‌సెంటర్లపై దాడి చేసి.. వారిద్దరిని అరెస్ట్‌ చేసి, మంగళవారం నగరానికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం