Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుల్‌భూషణ్ మరణశిక్షను నిలిపివేసిన అంతర్జాతీయ న్యాయస్థానం

Webdunia
బుధవారం, 17 జులై 2019 (18:51 IST)
అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ విజయం సాధించింది. గూఢచర్యం ఆరోపణలతో భారత పౌరుడు కుల్‌భూషణ్ యాదవ్‌కు పాకిస్థాన్ కోర్టు విధించిన మరణశిక్షను నిలిపివేసింది. పైగా, ఈ శిక్షను పునఃసమీక్షించాలంటూ పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ది హేగ్‌లోని అంతర్జాతీయ కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. మొత్తం 16 మంది న్యాయమూర్తుల్లో 15 మంది భారత్‌కు అనుకూలంగా తీర్పునివ్వగా, ఒక్క జడ్జి మాత్రం వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. 
 
గూఢచర్యం ఆరోపణలపై 2016లో కుల్‌భూషణ్‌ యాదవ్‌ను పాకిస్థాన్ అరెస్టు చేసింది. ఈ కేసులో 2017 ఏప్రిల్‌లో కుల్‌భూషణ్‌కు పాక్‌ సైనిక కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెల్సిందే. కుల్‌భూషణ్‌ యాదవ్‌ను పాకిస్థాన్ అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టడమే కాకుండా, అతనికి మరణశిక్షను పాక్ సైనిక కోర్టు విధించింది. యాదవ్ పెట్టుకున్న క్షమాభిక్షను కూడా తోసిపుచ్చారు. 
 
దీంతో భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన ఐసీజే మరణశిక్షను రద్దు చేసింది. అదేసమయంలో జాదవ్‌ కేసును పునఃసమీక్షించాలని పాక్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. భారత రాయబార కార్యాలయ అధికారులను కలుసుకునేందుకు.. జాదవ్‌కు అవకాశం ఇవ్వాలని తీర్పులో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments