Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుల్‌ భూషణ్ జాదవ్‌కు కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు!!

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2020 (19:01 IST)
పాకిస్థాన్ జైలులో మగ్గుతున్న భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఇప్పటికే గూఢచర్యం ఆరోపణలపై ఆయన అరెస్టు అయివున్నాడు. ఈ క్రమంలో ఆయనకు తాజాగా మరో కష్టం ఎదురైంది. ఆయన తరపున కోర్టులో వాదించకూడదని పాకిస్థాన్ న్యాయవాదులు నిర్ణయించుకున్నారు. దీంతో ఆయన విడుదలలో మరింత జాప్యం నెలకొనేలా వుంది. 
 
గూఢచర్యం ఆరోపణలపై గత కొన్నేళ్లుగా పాకిస్థాన్ జైలులో మగ్గుతూ మరణశిక్ష ఎదుర్కొంటున్న భారత మాజీ నేవీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కష్టాలు ఇప్పట్లో తీరేట్టు కనిపించడంలేదు. జాదవ్ తరఫున వాదించకూడదని పాక్ న్యాయవాదులు నిర్ణయించుకోవడమే అందుకు కారణం.
 
వాస్తవానికి జాదవ్ తరపున వాదించాలని మఖ్దూం అలీఖాన్, అబిద్ హసన్ మింటో అనే ఇద్దరు సీనియర్ లాయర్లను ఇస్లామాబాద్ హైకోర్టు కోరింది. అయితే వారిద్దరూ అందుకు నిరాకరించారు. తాను ఇప్పటికే రిటైరయ్యానని అబిద్ హసన్ మింటో పేర్కొనగా, తనకే వేరే పనులు ఉన్నాయని మఖ్దూం అలీఖాన్ చెప్పారు. ఈ మేరకు ఇస్లామాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ కు తమ అభిప్రాయాలను తెలియజేశారు.
 
ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ముందుగానే ఊహించిన భారత ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తీర్పును గౌరవించేలా ఒత్తిడి చేస్తోంది. అంతేకాకుండా, తమ భారత న్యాయవాదిని, లేక క్వీన్స్ కౌన్సెల్‌ను అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. అయితే, పాక్ విదేశాంగ శాఖ అందుకు కూడా అనుమతించలేదు. 

సంబంధిత వార్తలు

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

ఆ హీరోయిన్ల విషయంలో ఎందుకు అలా అడుగుతారో అర్థం కాదు : సోనాక్షి సిన్హా

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments