Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా టేబుల్ మీద న్యూక్లియర్ బటన్ ఉంటుంది: కిమ్ జాంగ్

ప్రపంచ దేశాలను అణు పరీక్షలతో వణికిస్తున్న ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ కొత్త సంవత్సరాది శుభాకాంక్షలను కూడా తనదైన శైలిలోనే చెప్పారు. తన టేబుల్ మీద న్యూక్లియర్ బటన్ వుందని.. కిమ్ జాంగ్ అన్నారు. దా

Webdunia
సోమవారం, 1 జనవరి 2018 (14:30 IST)
ప్రపంచ దేశాలను అణు పరీక్షలతో వణికిస్తున్న ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ కొత్త సంవత్సరాది శుభాకాంక్షలను కూడా తనదైన శైలిలోనే చెప్పారు. తన టేబుల్ మీద న్యూక్లియర్ బటన్ వుందని.. కిమ్ జాంగ్ అన్నారు. దాన్ని నొక్కితే అణు బాంబు బయల్దేరుతుందని షాకింగ్ కామెంట్స్ చేశారు. కానీ ఇలా చెప్పడం ద్వారా తాను బ్లాక్ మెయిల్ చేయట్లేదని.. ఇది నిజమైన విషయమని కిమ్ జాంగ్ వ్యాఖ్యానించారు.
 
ఉత్తర కొరియా అణ్వస్త్ర సంపద కలిగున్న దేశమేనంటూ ప్రపంచ దేశాలు జడుసుకుంటున్న నేపథ్యంలో గత కొంతకాలంగా ఉత్తర కొరియాపై ఆంక్షలను అమలు చేస్తున్నప్పటికీ, వాటిని కిమ్ జాంగ్ బేఖాతరు చేస్తున్నారు. అంతేగాకుండా అణు పరీక్షలను కూడా కొనసాగిస్తున్నారు. కిమ్‌ను కట్టడి చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా ఎన్ని చర్యలు చేపట్టినా.. ఫలితం మాత్రం శూన్యం. తాజాగా కిమ్ టేబుల్ మీద న్యూక్లియర్ బటన్ వుందని.. దాన్ని నొక్కితే అణుబాంబు బయల్దేరుతుందని చెప్పడం ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
 
ఇదిలా ఉంటే ఉత్తర కొరియాపై యూఎస్‌ జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ మాజీ ఛైర్మన్‌ మైక్‌ ముల్లెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నడూ లేని విధంగా ఉత్తరకొరియాతో త‌మ దేశం యుద్ధానికి దగ్గరవుతోందని ఆందోళన వ్యక్తం చేశఆరు. ఇరుదేశాల‌ మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. ఇటువంటి ప‌రిస్థితుల్లో ఈ సమస్యను దౌత్యపరంగా పరిష్కరించే అవకాశం ఉందని తాను భావించట్లేదని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమ్మాయిలు క్యూట్ గా అలాంటి తప్పులు చేస్తే మాకు బాగా నచ్చుతుంది : హీరో నితిన్

అట్లీతో అల్లు అర్జున్ సినిమా.. ఐదుగురు హీరోయిన్లు నటిస్తారట?

జూన్ లో చిరంజీవి షూటింగ్ ప్రారంభిస్తామన్న అనిల్ రావిపూడి

మిథున్ చక్రవర్తి లవ్ స్టొరీ బిగిన్స్ చిత్రం మొదలైంది

David Warner: రాబిన్ హుడ్‌ సినిమాలో డేవిడ్ వార్నర్... నితిన్, శ్రీలీల చిత్రాల్లో ఎలా కనిపిస్తారో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments