Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ల రాజ్యం: స్వదేశానికి చేరుకుంటున్న భారతీయులు

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (11:10 IST)
ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ల రాజ్యం ప్రారంభమైంది. ఆప్ఘన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లిపోయింది. అక్కడి తమ ప్రజలను వెంటనే తీసుకుపోయేందుకు అమెరికా ప్రత్యేక పౌర, యుద్ధ విమానాలను రంగంలోకి దింపింది. అంతేకాదు... రాజధాని కాబూల్‌లో ఎయిర్ ట్రాఫిక్‌ను తన అధీనంలోకి తీసుకుంటోంది. తద్వారా... తమ పౌరులను సురక్షితంగా తీసుకుపోయేలా ప్లాన్ వేసుకుంటోంది.
 
ఆదివారం నుంచి కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు రద్దీగా మారిపోయింది. భారతీయులు సహా అన్ని దేశాల ప్రజలూ... స్వదేశాలకు వెళ్లిపోయేందుకు కాబూల్ ఎయిర్‌పోర్టుకు వస్తున్నారు. రాత్రంతా జనం వస్తూనే ఉన్నారు. అందువల్ల అక్కడ ఎటు చూసినా ప్రయాణికులే కనిపిస్తున్నారు.
 
భారత ప్రభుత్వం ఓ విమానాన్ని సిద్ధంగా ఉంచింది. అందులో భారతీయుల్ని సురక్షితంగా ఇండియా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అమెరికా గనుక ఎయిర్ ట్రాఫిక్‌ని తన కంట్రోల్‌‌లోకి తెచ్చుకుంటే అప్పుడు అమెరికాతో మాట్లాడుకొని ఇండియా తన విమానాన్ని నడపాల్సి ఉంటుంది.
 
అమెరికా సంపన్న దేశం కావడంతో... తమ పౌరుల్ని తరలించే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. 6వేల మంది సైన్యాన్ని రక్షణగా పెట్టుకుంది. అమెరికా వేల మంది తమ పౌరుల్ని తరలించనుంది. వారిలో చాలామంది... అమెరికా ఇదివరకు చేయదలచిన యుద్ధంలో సేవలు అందించేందుకు ఆప్ఘన్ వచ్చినవారే. వారంతా ఇప్పుడు అమెరికా వెళ్లిపోతున్నారు.
 
చాలా దేశాలు ఇప్పుడు తమ తమ పౌరులను తరలించే పనిలో ఉన్నాయి. భారత్ విషయానికి వస్తే.. ఆదివారం ఎయిర్ ఇండియా విమానంలో ఆప్ఘనిస్థాన్ నుంచి 129 మంది ప్రయాణికులు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. సోమవారం మరో విమానం అక్కడి నుంచి ఉదయం సమయంలోనే బయలుదేరుతుంది. కొన్ని రోజుల ముందు నుంచే ఇండియా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కల్యాణ్ పైన పోసాని, శ్రీరెడ్డి దుర్భాషలు: ఏపీ హోం మంత్రికి గబ్బర్ సింగ్ సాయి కంప్లైంట్

రామ్ చరణ్ బ్యాక్ ఫోజ్ సూపర్.. గేమ్ ఛేంజర్‌లో కలుద్దాం

అమ్మతోడుగా చెబుతున్నా.. కోర్టులు దోషిగా నిర్ధారించలేదు.. అప్పటివరకు నిర్దోషినే : నటి హేమ

నిజమైన భారతీయుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్: ఎస్.జె సూర్య (Video)

రూ.1,000 కోట్ల క్లబ్‌కు చేరువలో ప్రభాస్ "కల్కి 2898 AD"

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments