Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెక్స్ ట్రాఫికింగ్ కేసులో కీలక నిందితుడు జైలులో అనుమానాస్పద మృతి

Webdunia
మంగళవారం, 13 ఆగస్టు 2019 (12:59 IST)
అమెరికాలో సెక్స్ ట్రాఫికింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రధాన నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ అనుమానాస్పదరీతిలో మృతిచెందాడు. ఈయన అమెరికాలోవున్న ప్రముఖ ఫైనాన్షియర్లలో ఒకరు. సెక్స్ ట్రాఫికింగ్ కేసులో అరెస్టు అయ్యారు. ప్రస్తుతం ఆయన జైలు జీవితం గడుపుతుంటే కేసు విచారణ సాగుతోంది. ఈ కేసులో దోషిగా తేలినపక్షంలో ఆయనకు 45 యేళ్ళ జైలుశిక్ష పడే అవకాశం ఉంది. 
 
ఈ నేపథ్యంలో ఆయన అనుమానాస్పదంగా చనిపోవడం ఇపుడు మిస్టరీగా మారింది. అత‌ను ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడా లేక స‌హ‌జంగా మ‌ర‌ణించాడా అన్న సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. అనేక‌ మంది మైన‌ర్ అమ్మాయిల‌ను అత్యాచారం చేశాడ‌ని ఎప్‌స్టీన్‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అత‌న్ని గ‌త జూలైలో అరెస్టు చేసి జైలుకు తీసుకువెళ్లారు. 
 
ఆ తర్వాత ఆయన పలుమార్లు జైలులో ఆత్మహత్యకు ప్ర‌య‌త్నించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీంతో అత‌నిపై నిఘా కూడా పెట్టారు. కానీ ఎప్‌స్టీన్ మృతికి ముందు ఆ నిఘాను ఎత్తివేశారు. జైలు సెల్‌లోనే అత‌ని శ‌వాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో ఎప్‌స్టీన్‌పై న‌ష్ట‌ప‌రిహారం కేసులు వేసిన అమ్మాయిలు గ‌గ్గోలుపెడుతున్నారు. 
 
అమెరికాలో మేటి ఫైనాన్స‌ర్‌గా ఎప్‌స్టీన్‌కు గుర్తింపు ఉంది. అత‌నికి ఆ దేశ మేటి రాజ‌కీయ‌వేత్త‌లు, వ్యాపార‌వేత్త‌ల‌తో సంబంధాలు ఉన్నాయి. అత‌ని ఫ్రెండ్స్ లిస్టులో బిల్ క్లింట‌న్‌, డోనాల్డ్ ట్రంప్ ఉన్నారు. అయితే ఆ సంబంధాలు బ‌య‌ట‌ప‌డుతాయ‌న్న ఉద్దేశంతోనూ ఎప్‌స్టీన్‌ను హ‌త్య చేసి ఉంటార‌ని అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. వంద‌లాది డాల‌ర్లను ఎర చూపి ఎప్‌స్టీన్ అనేక మంది అమ్మాయిల‌ను అనుభ‌వించాడ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అలాంటి జెఫ్రీ జైలు బోనులో మరణించడం ఇపుడు మిస్టరీగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

సరికొత్త స్క్రీన్ ప్లేతో వస్తున్న 28°C మూవీ మెస్మరైజ్ చేస్తుంది : డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్

ప్రత్యేకమైన రోజుగా మార్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : ఉపాసన

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం