Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్‌లో భార్యకు ఎన్ని లైక్స్ వస్తే అన్ని పిడిగుద్దులు

సామాజిక మాధ్యమాల్లో అగ్రగామి అయిన ఫేస్‌బుక్‌ను ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో ఫోటోలను పోస్ట్ చేయడం, ఇతరుల ఫోటోలకు లైక్స్ ఇవ్వడం.. వాటిని షేర్ చేయడం అనేవి ప్రస్తుతం ఫ్యాషనైపోయాయి. అయితే ఇక

Webdunia
గురువారం, 30 నవంబరు 2017 (15:47 IST)
సామాజిక మాధ్యమాల్లో అగ్రగామి అయిన ఫేస్‌బుక్‌ను ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో ఫోటోలను పోస్ట్ చేయడం, ఇతరుల ఫోటోలకు లైక్స్ ఇవ్వడం.. వాటిని షేర్ చేయడం అనేవి ప్రస్తుతం ఫ్యాషనైపోయాయి. అయితే ఇక్కడో ప్రబుద్ధుడు.. భార్య ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసే ఫోటోలకు ఎన్ని లైకులొస్తే అన్ని పిడిగుద్దులు గుద్దాడు. భర్త పిడిగుద్దులతో బాధితురాలి ముఖం గుర్తు తెలియని విధంగా వాచిపోయింది.
 
వివరాల్లోకి వెళితే.. ఉరుగ్వేకు చెందిన సన్సీ ప్రావిన్స్‌, నెంబీ ప్రాంతానికి చెందిన అడోల్ఫినా. ఈమె భర్త పేరు గలియానో. ఇతడికి అడోల్ఫినాపై అనుమానం ఎక్కువ. ఈ అనుమానం విపరీతానికి దారితీసింది. ఫేస్‌బుక్‌లో అడోల్ఫినా చేసే పోస్టులకు లేదా ఫోటోలకు ఎన్ని లైక్స్ వస్తాయో ఆమె ముఖంపై అన్ని పిడిగుద్దులు గుద్ది కొలియానో చిత్ర హింసలకు గురిచేశాడు. 
 
భార్యపై వున్న అనుమానంతో ఆమె ఫేస్‌బుక్‌ను తన కంట్రోల్‌లో పెట్టుకున్నాడు. ఆపై ఆమె ఫోటోలను అతడే పోస్టు చేసి.. ఎవరైనా లైకులు పెట్టినా, షేర్ చేసినా, కామెంట్ చేసినా ఒక్కో పిడిగుద్దు లెక్కన రోజు ఆమెను కొట్టి హింసించేవాడు. ఇలా ముఖంపై ఇష్టమొచ్చినట్లు భర్త కొట్టడంతో అడోల్ఫినా ముఖం తీవ్రగాయాలపాలైంది. అంతేగాకుండా గలియానో దాడి చేయడం ద్వారా అడోల్ఫినా శరీరంలోనూ తీవ్రగాయాలున్నట్లు వైద్యులు గుర్తించారు. 
 
ఈ ఘటనపై అడోల్ఫినా తండ్రి తీవ్ర ఆవేదనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని గలియానోను అరెస్ట్ చేశారు. అడోల్ఫినా ముఖం గుర్తు తెలియని విధంగా మారిపోవడంతో ఆమెను ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. ఆమెకు శస్త్రచికిత్స చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అరెస్టయిన గలియానోకు కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments