సామాన్యుడి ప్రేమలో జపాన్‌ రాకుమారి.. ఆ హోదాను రూ.10 కోట్లను వదులుకుంది..

Webdunia
శనివారం, 2 అక్టోబరు 2021 (16:24 IST)
Japan princess
జపాన్‌ రాకుమారి మాకో ఓ సామాన్యుడి ప్రేమలో పడింది. న్యాయవాద విద్యార్థి కొమురో ఇప్పటికే పీకలలోతు ప్రేమలో మునిగితేలుతున్న ఆమె.. కుటుంబాన్ని సైతం ఒప్పించి.. తన ప్రేమను పెళ్లి పీఠల వరకు నడిపించారు. మొత్తానికి మాకో-కొమురో వివాహానికి ముహూర్తం ఫిక్స్‌ చేశారు.. ఈ నెల 23వ తేదీన మాకోకు 30 ఏళ్లు నిండనుండగా.. 26వ తేదీన మాకో-కొమురో వివాహం రిజిస్టర్‌ చేయాలని నిర్ణయించారు.
 
ఇక, ఆమెకు కాబోయే అత్తింటివారి ప్రమేయంతో నెలకొన్న ఓ ఆర్థికపరమైన వివాదం వల్ల ఈ పెళ్లికి ప్రజామోదం పూర్తిగా లేనట్టుగా తెలుస్తోంది.. దీంతో వివాహ విందు, ఇతర లాంఛనాలేమీ లేకుండా.. చాలా సింపిల్‌గా రిజిస్టర్‌ మ్యారేజీకి పరిమితం అవుతారని చెబుతున్నారు. 
 
కాగా, న్యూయార్క్‌లో న్యాయవాద విద్యను అభ్యసిస్తున్న కొమురో వారం క్రితమే జపాన్‌కు తిరిగొచ్చారు. వివాహం తర్వాత కొత్త దంపతులు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారట.. ఇక, న్యూయార్క్‌ వెళ్లి అక్కడే కాపురం పెట్టే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.. అయితే, క్రిస్టియన్‌ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న రోజుల్లో మాకో, కొమురో స్నేహితులయ్యారు.. అది క్రమంగా ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత 2017 సెప్టెంబర్‌లో పెళ్లి చేసుకోనున్నట్టు ప్రకటించారు.
 
కానీ, కొన్ని ఆర్థిక వివాదాల వల్ల పెళ్లి రద్దు అయ్యింది.. మొత్తంగా నాలుగేళ్ల తర్వాత మళ్లీ పెళ్లితో ఏకం కానున్నారు. మరోవైపు.. జపాన్‌ రాజకుటుంబానికి చెందిన యువతి, సామాన్య యువకుడిని పెళ్లిచేసుకుంటే అక్కడ నిబంధనల ప్రకారం రాకుమారి హోదాను వదిలిపెట్టాల్సి ఉంటుంది.. ఇక, సామాన్య వ్యక్తిని రాకుమారి పెళ్లాడితే రాజప్రాసాదం తరఫున ఆమెకు రూ.10 కోట్లు ఇస్తారు. కానీ, తన కుటుంబం ఇవ్వాలనుకున్న ఆ భారీ మొత్తాన్ని కూడా మాకో తీసుకునేందుకు తిరస్కరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments