కమ్యూనిస్టు పార్టీలో చేరాలని వుంది.. జాకీచాన్

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (12:53 IST)
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ హీరో జాకీ చాన్‌. తాజాగా ఆయన తన మనసులో మాటను బయటపెట్టారు. తనకు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనాలో (సీపీసీ) చేరాలని ఉందని తెలిపారు. 
 
ఈ నెల ఒకటో తేదీన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంపై జులై 6న దేశ సినీ ప్రముఖులు ఓ చర్చా కార్యక్రామన్ని నిర్వహించారు. 
 
ఈ కార్యక్రమానికి చైనా ఫిలిం అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్న జాకీచాన్‌ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగానే జాకీచాన్‌ మాట్లాడుతూ, తాను సీపీసీలో చేరాలని వుందంటూ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని చైనా అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ బయటపెట్టింది. 
 
‘కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా గొప్పతనం కళ్ల ముందే కనిపిస్తోంది. ఈ పార్టీ ఏది చెప్పినా కచ్చితంగా చేస్తుంది. కేవలం కొన్ని దశాబ్దాల కాలంలోనే సాధ్యం చేసి చూపించింది. నేను సీపీసీలో సభ్యుణ్ని కావాలనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారని గ్లోబల్ టైమ్స్‌ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RC 17: పుష్ప 3 కు బ్రేక్ - రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో ఆర్.సి. 17 రెడీ

Aadi Sai Kumar: ఆది సాయి కుమార్ మిస్టికల్ థ్రిల్లర్ శంబాల రిలీజ్ అనౌన్స్‌మెంట్

Dude: ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ సినిమాకి రిపీట్ ఆడియన్స్ వస్తున్నారా !

K. Ramp Review: కిరణ్ అబ్బవరం.. కె. ర్యాంప్ తో సక్సెస్ సాధించాడా... కె. ర్యాంప్ రివ్యూ

Harish Shankar: ప‌వ‌న్ క‌ల్యాణ్... ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ గురించి నిర్మాత తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments