Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాక్ మాకు చైనా షాక్.. టెక్ దిగ్గజంగా డ్రాగన్ ఒప్పుకోవట్లేదా?

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (14:43 IST)
చైనా టెక్ ఐకాన్ జాక్ మాకు ఆ దేశం మరో షాకిచ్చింది. అసలు చైనాలో ఇంటర్నెట్ అంటే పెద్దగా తెలియని రోజుల్లోనే అలీబాబా గ్రూప్‌ను స్థాపించి దేశంలోనే అత్యంత సంపన్నుడిగా ఎదిగిన జాక్ మాను.. ఇప్పుడో టెక్ ప్రముఖుడిగా గుర్తించడానికి కూడా చైనా అంగీకరించడం లేదు. తాజాగా అక్కడి అధికార మీడియా మంగళవారం దేశానికి మార్గదర్శకులుగా వ్యవహరిస్తున్న టెక్ దిగ్గజాల గురించి ప్రత్యేకంగా ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే ఇందులో జాక్ మా ఊసే లేదు. 
 
అదే సమయంలో ఆయన ప్రత్యర్థి అయిన పోనీ ఎం పేరును ప్రత్యేకంగా ప్రస్తావించింది. మొబైల్ రంగ చరిత్రనే తిరగరాస్తున్న వ్యక్తిగా పోనీ ఎంపై ప్రశంసలు కురిపించింది. ఆయనతోపాటు బీవైడీ సంస్థ చైర్మన్ వాంగ్ చువాన్‌ఫు, షియోమీ కో ఫౌండర్ లీ జున్‌, హువావీ టెక్నాలజీస్‌కు చెందిన రెన్ జెంగ్‌ఫెయ్‌ల పేర్లను కూడా చైనా అధికార మీడియా ప్రత్యేకంగా ప్రస్తావించింది.
 
చైనా నియంత్రణ సంస్థలపై గతేడాది అక్టోబర్‌లో జాక్ మా చేసిన వ్యాఖ్యలతో ఆ దేశం ఈ కుబేకుడిని పక్కన పెట్టేసింది. ఆ తర్వాత రెండు నెలల పాటు అసలు ఆయన కనిపించకుండా పోయారు. చైనా బ్యాంకింగ్‌ వ్యవస్థ గురించి జాక్‌ మా చేసిన విమర్శలు.. జిన్‌పిన్‌ ప్రభుత్వం ఆగ్రహానికి దారితీశాయి. ఆర్థిక వ్యవస్థలో లోపాలున్నాయని, బ్యాంకులు బంట్లుగా వ్యవహరిస్తున్నాయని జాక్‌ మా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

ఆడ పిల్లలు ఎదిగేందుకు తోడ్పాడు అందించాలి : నారి గ్లింప్స్ రిలీజ్ చేసిన మంత్రి సీతక్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments