Webdunia - Bharat's app for daily news and videos

Install App

డొనాల్డ్ ట్రంప్ అక్రమ సంబంధం.. అందుకే తొలి భార్య విడాకులు తీసుకుంది..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి భార్య ఆయన అక్రమ సంబంధం గురించి ఓ పుస్తకంలో వెల్లడించారు. ఓ వైపు తనతో కాపురం చేస్తూ మరోవైపు అక్రమ సంబంధాన్ని నడిపినందునే తన వైవాహిక జీవితం విచ్ఛిన్నమైందని ట్రంప్

Webdunia
ఆదివారం, 8 అక్టోబరు 2017 (12:16 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి భార్య ఆయన అక్రమ సంబంధం గురించి ఓ పుస్తకంలో వెల్లడించారు. ఓ వైపు తనతో కాపురం చేస్తూ మరోవైపు అక్రమ సంబంధాన్ని నడిపినందునే తన వైవాహిక జీవితం విచ్ఛిన్నమైందని ట్రంప్ తొలి భార్య తెలిపారు. ప్రేమ, పెళ్లి, విడాకుల వరకూ జరిగిన సంఘటనలపై ఆమె 'రైజింగ్ ట్ర్రంప్' పేరిట ఓ పుస్తకాన్ని రాశారు. వచ్చే వారంలో మార్కెట్లోకి విడుదల కానున్న ఈ పుస్తకంలో ఇవానా పలు కీలక విషయాలను తెలిపారు.
 
తన పెళ్లి బంధం ముగియనుందని డిసెంబర్ 1989లోనే తెలుసుకున్నానని ఇవానా ఈ పుస్తకంలో తెలిపింది. ఓ రోజు ఓ అమ్మాయి తన ఇంటికి వచ్చి.. తన పేరు మార్లా అని పరిచయం చేసుకుందని వెల్లడించినట్లు ఇవానా చెప్పుకొచ్చారు. తన భర్తను ప్రేమిస్తున్నానని తెలిపిందని.. దీంతో కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా అరిచానని ఇవానా తెలిపారు. భర్తంటే తనకెంతో ప్రేమని చెప్పానని, కానీ ఆ షాక్ నుంచి మాత్రం తేరుకోలేక పోయానన్నారు. 
 
ఓ రెస్టారెంట్ లో పరిచయం అయిన ట్రంప్, తనను ఎంతో బాగా చూసుకునేవారని, అయితే, మార్లాతో ట్రంప్ అక్రమ సంబంధం పెట్టుకున్న తరువాత మాత్రం తన మనసు వికలమైందని తెలిపారు. తామిద్దరం విడిపోయిన తరువాత తమ బిడ్డ డొనాల్డ్ జూనియర్, చాలా కాలం తండ్రితో మాట్లాడలేదని, ప్రస్తుతం తామిద్దరం స్నేహితుల్లా ఉన్నామని అన్నారు. ట్రంప్‌కు బదులు తన కుమార్తె ఇవాంకా ట్రంప్ అమెరికాకు అధ్యక్షురాలైతే బాగుండేదని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments