Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సుష్మా స్వరాజ్‌పై ప్రశంసలు గుప్పించిన ట్రంప్ కుమార్తె ఇవాంకా

భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ కుమార్తె ప్రశంసలు గుప్పించారు. భారత దేశానికి చెందిన, ఛరిష్మా కలిగిన సుష్మా స్వరాజ్‌ను కలుసుకోవడం ఎంతో గర్వంగా వుందని ట్రంప్ కుమార

Advertiesment
సుష్మా స్వరాజ్‌పై ప్రశంసలు గుప్పించిన ట్రంప్ కుమార్తె ఇవాంకా
, మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (09:46 IST)
భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ కుమార్తె ప్రశంసలు గుప్పించారు. భారత దేశానికి చెందిన, ఛరిష్మా కలిగిన సుష్మా స్వరాజ్‌ను కలుసుకోవడం ఎంతో గర్వంగా వుందని ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ అన్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశానికి సుష్మా, ఇవాంకా ట్రంప్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వుమెన్స్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్‌తో పాలు ఇరు దేశాల్లో శ్రామిక అభివృద్ధిపై వీరిరువురూ చర్చించారు.
 
భేటీ అనంతరం సుష్మాపై ఇవాంకా ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించారు. సుష్మాను కలుసుకోవడం ఎంతో గర్వంగా వుందని చెప్పుకొచ్చారు. వుమెన్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ త్వరలో జరుగనున్న జీఈఎస్ 2017, అమెరికా,  భారత్‌లలో వర్క్ ఫోర్స్ డెవలప్‌మెంట్ గురించి తమ మధ్య గొప్ప చర్చ జరిగిందన్నారు.
 
భారత, అమెరికా దేశాల ఆధ్వర్యంలో జరిగే ప్రతిష్టాత్మక ప్రపంచ శిఖరాగ్ర పారిశ్రామికవేత్తల సదస్సు (గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌)-2017.. నవంబర్ 28 నుంచి 30 వరకూ హైదరాబాద్‌లో (జీఈఎస్) జరగనుంది. ఈ సదస్సుకు అమెరికా తరఫున ఇవాంకా హాజరవుతున్నారు.
 
అలాగే ఈ నెల 23న ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధుల సభ 72వ వార్షిక సమావేశంలో సుష్మాస్వరాజ్‌ ప్రసంగించనున్నారు. మరోవైపు ఇండియన్‌ ఎంబసీ కూడా న్యూయార్క్‌లో సుష్మా, ఇవాంకా భేటీకి సంబంధించి ఓ ఫోటోను ట్విట్‌ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మారువేషంలో హనీప్రీత్... ఖాట్మండులో కనిపించిందట...