Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాన్-ఇజ్రాయేల్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు- ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చిన పుతిన్

సెల్వి
గురువారం, 19 జూన్ 2025 (13:35 IST)
ఇరాన్, ఇజ్రాయేల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఇజ్రాయేల్ తాట తీసేందుకు ఇరాన్ సిద్ధమైంది. తాజాగా ఇరాన్‌పై దాడులకు అమెరికా ఇజ్రాయేల్‌కు సాయం చేస్తుందనే వార్తల నేపథ్యంలో రష్యా సంచలన ప్రకటన చేసింది. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో అమెరికా తలదూర్చొద్దని హెచ్చరించారు. 
 
ఇజ్రాయెల్‌కు అమెరికా ఎలాంటి సైనిక సాయం చేయొద్దన్నారు. ఒకవేళ తలదూర్చితే పరిణామాలు తీవ్రంగా వుంటాయని హెచ్చరించారు. ఇజ్రాయేల్, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వానికి తాము సిద్ధమేనని చెప్పారు. గత శుక్రవారం నుంచి ఇజ్రాయెల్‌.. ఇరాన్‌పై దాడులు చేస్తోంది. 
 
పశ్చిమ ఇరాన్, టెహ్రాన్ గగనతంలపై తాము పూర్తిగా పట్టు సాధించామని ఇజ్రాయెల్ దళాలు పేర్కొన్నాయి. ఇప్పటిదాకా 70 ఇరాన్ ఎయిర్‌ డిఫెన్స్‌ బ్యాటరీలు ధ్వంసం చేశామని చెప్పాయి. తాజాగా ఇజ్రాయెల్‌ పైకి ఇరాన్ క్షిపణులు ప్రయోగిస్తోంది. ఇజ్రాయెల్‌ రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసేందుకు బాంబుల వర్షం కురిపిస్తోంది. 
 
ఇజ్రాయెల్‌లోని ప్రధాని ఆస్పత్రి సోరోఖాపై కూడా బాంబు దాడి జరిగింది. ఈ దాడుల్లో ఆస్పత్రి ధ్వంసమయ్యింది. బాంబులు పడటంతో పేషెంట్లు, డాక్టర్లు బయటకు పరుగులు పెట్టారు. అలాగే శిథిలాల కింద వందలాది మంది పేషెంట్లు చిక్కుకున్నారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 
మరోవైపు ఇరాన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. మా బాంబులతో ఇరాన్ నేలమట్టమవుతుందని తెలిపారు. ''ఇజ్రాయెల్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ చేయడం నా నిర్ణయం కాదు. న్యూక్లియర్‌ లేకుండా చేయడమే మా లక్ష్యం. మేము యుద్ధంలోకి దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. మా బాంబులతో ఇరాన్ నేలమట్టం అవుతుందని'' అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments