Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇజ్రాయేల్‌కు ఇక చుక్కలు చూపిస్తాం.. అమెరికా అడ్డొస్తే అంతే సంగతులు: ఇరాన్

సెల్వి
బుధవారం, 18 జూన్ 2025 (18:50 IST)
Iran
ఇరాన్ ఇజ్రాయేల్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది. ఇజ్రాయెల్, అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీ సంచలన వార్నింగ్ ఇచ్చారు. రక్తానికి రక్తమే సమాధామని అన్నారు. 
 
ఇజ్రాయెల్ చాలా పెద్ద తప్పు చేసిందని.. ఆ దేశాన్ని కచ్చితంగా శిక్షిస్తామన్నారు. ఇజ్రాయేల్- ఇరాన్‌ వ్యవహారంలో అమెరికా తలదూరిస్తే పర్యవసనాలు తీవ్రంగా వుంటాయని అలీ ఖమేనీ హెచ్చరించారు. అలాగే శాంతి చర్చలకు ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పారు. 
 
మరోవైపు ఇరాన్ అణుశుద్ధి స్థావరాలను దెబ్బతీయడమే ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే నంతాజ్ అణుశుద్ధి కర్మగారంపై దాడులు చేసింది. మరో కీలక అణు శుద్ధి కేంద్రమైన ఫోర్డోపై ఇజ్రాయెల్ దాడి చేసేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. 
 
అయితే వీటిపై బంకర్‌ బస్టర్ బాంబులు ఉపయోగించాలని ఇజ్రాయెల్ ప్లాన్ వేస్తోంది. ఈ బంకర్ బస్టర్‌ బాంబులు అమెరికా వద్ద మాత్రమే ఉన్నాయి. ఈ బాంబులు తమకు ఇవ్వాలని ఇజ్రాయెల్‌ అమెరికాను విజ్ఞప్తి చేస్తోంది. అయితే దీనికి ఇంకా అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anjali: అంజలి లీడ్ రోల్ లో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల చిత్రం

అఖండ2 కి నందమూరి బాలకృష్ణ డబ్బింగ్ పూర్తి చేశారు

గర్భవతి అని తెలిసినా ఆ నిర్మాత వదిలిపెట్టలేదు : రాధిక ఆప్టే

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

తర్వాతి కథనం
Show comments