శత్రుత్వాన్ని తగ్గించుకోండి.. దౌత్యపరంగా పరిష్కరించుకోండి... మోడీ సూచన

ఠాగూర్
ఆదివారం, 22 జూన్ 2025 (17:43 IST)
ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఈ యుద్ధంలో అమెరికా కూడా వచ్చిచేరింది. దీంతో పశ్చిమాసియాలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. టెహ్రాన్‌‌పై దాడులతో అది మరింత ముదిరింది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడులు నిర్వహించడంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఈ నేపథ్యంలో ఆయన ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ షెజెష్కియాన్‌తో ఫోన్‌కాల్ ద్వారా మాట్లాడారు. 
 
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిణామాలపై ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మసౌద్‌తో మాట్లాడిన ఆయన ప్రస్తుతం జరుపుతున్న దాడులను ఆపేయాలని కోరారు. శత్రుత్వాన్ని తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. దౌత్యమార్గంలో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. 
 
కాగా, ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధంలో సహకారంపై రెండు వారాల్లోగా చర్చలు జరిపి ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పి ట్రంప్.. టెహ్రాన్‌పై రెండు రోజుల్లో దాడులు నిర్వహించారు. ఇరాన్‌లోని మూడు కీలక అణుస్థావరాలై లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. 
 
అనంతరం స్పందించిన ఇరాన్.. అమెరికా దాడులకు ప్రతీకారం తీర్పుకుంటామని హెచ్చరించింది. ఇజ్రాయెల్‌‍పై దాడులు కూడా కొనసాగిస్తోంది. ఈ హెచ్చరికలపై స్పందించిన ట్రంప్... ప్రతీకారం చర్యలకు పాల్పడితే ఎన్నడూ చూడని విధంగా దాడులతో విరుచుకుపడతామని హెచ్చరించారు. ఈ క్రమంలో స్పందించిన మోడీ.. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments