Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానంలో ఒక్కసారిగా మంటలు.. తప్పిన మరో భారీ ప్రమాదం

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (11:31 IST)
ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు వరుసగా జరుగుతుండటంతో విమాన ప్రయాణీకుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఇటీవలే వరుసగా బోయింగ్ విమానాలు కూలిపోతున్న ఘటనలు జరుగగా తాజాగా ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయంలో మంగళవారం పెను ప్రమాదం తప్పింది.


విమానం ల్యాండ్ అయ్యే సమయంలో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో దాదాపు 100 మంది ప్రయాణీకులు అందులో ఉన్నారు. సకాలంలో స్పందించిన సిబ్బంది వెంటవెంటనే ప్రయాణీకులను కిందికి దించేసారు.
 
ఇరాన్ ఎయిర్ కంపెనీకి చెందిన ఫాకర్ 100 విమానంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సాంకేతిక కారణాలతో వెనుకవైపు ఉండే ల్యాండింగ్ గేర్ సకాలంలో తెరుచుకోకపోవడం వల్ల మంటలు చెలరేగినట్లు తెలిపారు. వెంట వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్‌లు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ హాని  జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాల కోసం మరింత లోతైన దర్యాప్తు జరుపుతామని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments