అమెరికా ఇండియానాలో సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. అప్పుడే పుట్టిన అవాంఛిత శిశువుల్ని వదిలించుకునేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. బిడ్డను వద్దనుకునే తల్లిదండ్రులు ఓ డబ్బాలో పెట్టి వెళ్లిపోవడమే ఈ పథక ఉద్దేశం. డబ్బాలోపల వాతావరణ నియంత్రణ వ్యవస్థను ఏర్పాటుచేశారు. డబ్బాలో బిడ్డను ఉంచి వెళ్లిన వెంటనే రక్షణ వ్యవస్థ ద్వారా తెలుసుకునే అత్యవసర సిబ్బంది నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకుని శిశువును తీసుకుంటారు.
ఈ పథకం కోసం ప్రపంచంలోనే అతిపెద్ద క్యాథలిక్ సంస్థగా పేరొందిన నైట్స్ ఆఫ్ కొలంబస్ వంద డబ్బాలను సమకూర్చనుంది. అలాగే, ఈ డబ్బాల్లో తమ పిల్లలను వదిలి వెళ్లే తల్లిదండ్రులకు ఈ పథకం ప్రయోజనకరమని 'సేఫ్ హెవెన్ బేబీ బాక్సెస్' వ్యవస్థాపకులు, ఉద్యమకారులు మోనికా కెల్సే పేర్కొన్నారు. ఇదేమీ నేరం కాదనీ, చట్టబద్ధమేనన్నారు.