Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘన్ నుంచి వాందరికీ ఈ-వీసా తప్పనిసరి : కేంద్రం

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (15:49 IST)
తాలిబన్ హస్తగతమైన ఆప్ఘనిస్థాన్‌ దేశం నుంచి అనేక మంది మంది ఇతర దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. ఇలాంటివారిలో భారత్‌కు వచ్చే వారందరికీ ఈ-వీసా( e-Visa)లు త‌ప్ప‌నిస‌రి చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. అలాగే, గ‌తంలో ఇండియ‌న్ వీసాలు పొంది ఇప్పుడు మ‌న దేశంలోని లేని ఆఫ్ఘ‌న్ల వీసాల‌న్నింటినీ ర‌ద్దు చేసింది. ఆఫ్ఘ‌న్ జాతీయుల పాస్‌పోర్ట్‌లు గ‌ల్లంత‌య్యాయ‌న్న వార్త‌ల నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. 
 
భారత్‌కు రావాల‌నుకుంటున్న ఆఫ్ఘ‌న్లు వీసా కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అధికారిక పోర్ట‌ల్‌ను కూడా సూచించింది. ww.indianvisaonline.gov.inలో ఆఫ్ఘ‌న్ జాతీయులు త‌మ ఈ-వీసాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని ప్ర‌భుత్వం తెలిపింది. 
 
ఇండియాకు రావాల‌ని అనుకుంటున్న ఆఫ్ఘ‌న్ జాతీయుల ద‌ర‌ఖాస్తుల‌ను వేగ‌వంతం చేయాల‌న్న ఉద్దేశంతో ఈ నెల మొద‌ట్లో భార‌త ప్ర‌భుత్వం కొత్త‌గా ఈ-వీసాల‌ను జారీ చేయాల‌ని నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం ఉన్న వీసా కేట‌గిరీల‌లో దేని కిందికీ రాని వీసాల కోసం కొత్త‌గా ఈ e-Emergency X-Misc Visa జారీ చేయ‌నున్న‌ట్లు హోంశాఖ చెప్పింది. ఈ వీసాలను నిర్ధిష్ట కాల ప‌రిమితితో జారీచేస్తారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments