Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై నుంచి మీ బీమా ప్రీమియం పెరుగుతోంది... మోదీ GST, సౌదీలో ఫ్యామిలీ ట్యాక్స్

చూస్తుంటే జూలై 1ని ప్రపంచ పన్నుపోటు దినోత్సవంలా ప్రకటించేలా ఉన్నారు దేశ, ప్రపంచ ప్రభుత్వాధినేతలు. మునుపటి తుగ్లక్ పాలనను గుర్తుకుతెస్తూ కనివినీ ఎరుగని పేర్లతో, సాకులతో ప్రజల పళ్లు రాలగొట్టేందుకు పన్ను పోటుని మార్గంగా ఎంచుకుని ఆ విధంగా ముందుకెళ్తున్నా

Webdunia
గురువారం, 29 జూన్ 2017 (18:10 IST)
చూస్తుంటే జూలై 1ని ప్రపంచ పన్నుపోటు దినోత్సవంలా ప్రకటించేలా ఉన్నారు దేశ, ప్రపంచ ప్రభుత్వాధినేతలు. మునుపటి తుగ్లక్ పాలనను గుర్తుకుతెస్తూ కనివినీ ఎరుగని పేర్లతో, సాకులతో ప్రజల పళ్లు రాలగొట్టేందుకు పన్ను పోటుని మార్గంగా ఎంచుకుని ఆ విధంగా ముందుకెళ్తున్నారు. 
 
కుబేరుల నల్లధనాన్ని తిరిగి భారత్‌కు రప్పిస్తామనే నినాదంతో గద్దెనెక్కిన మోదీ ఆ సంగతటుంచి సామాన్య, మధ్య తరగతి ప్రజల కనీసావసరాలను కూడా గాలికొదిలేసి, బీమా రంగం, వైద్య రంగాలపై కూడా పన్నుని 18 శాతం పెంచేసి ప్రజల ప్రాణాలతో, ప్రయోజనాలతో ఆటాడేసుకుంటున్నారు. ఈ పన్నుల ఆటలో మోదీ ప్రభుత్వానికి ధీటుగా సౌదీ ప్రభుత్వం పన్ను పోటుని మరో మెట్టు పైకి తీసుకెళ్తోంది. 
 
18 సంవత్సరాలు దాటిన యువకుల నుండి పన్ను వసూలు చేసుకునే పనిలో బిజీగా ఉంది. మన జీఎస్టీ లానే అది కూడా జూలై 1 నుండే అమల్లోకి రానుంది. 2017 జూలై నుండి 2018 జూన్ వరకు అంటే ఒక్క సంవత్సరానికి ఒక్కో కుటుంబ సభ్యునిపై నెలకు రూ.1721 చెల్లించాలని అల్టిమేటం జారీ చేసింది.
 
ఇందులో కొన్ని వెసులుబాట్లు కూడా ఉన్నాయండోయ్... ఒక్కో నెల కాకుండా సంవత్సరానికంతటికీ ఒకేసారి చెల్లించేస్తే కొంత మొత్తం తగ్గుతుంది. ఐతే దీనిపై సౌదీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments