Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ను చైనా బెదిరింపులకు గురిచేస్తోందా? డొనాల్ట్ ట్రంప్ ఏమన్నారు?

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (11:14 IST)
భారత్‌-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. ఇరు దేశాల మధ్య పరిస్థితులు అత్యంత దారుణంగా తయారయ్యాయని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో చైనా అత్యంత దూకుడుగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఉభయ దేశాల మధ్య కలగజేసుకొని సాయం చేయడానికి తాను ఇష్టపడుతున్నానని చెప్పుకొచ్చారు.
 
ఇందులో భాగంగా ఇరు వర్గాలతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. భారత్‌ను చైనా బెదిరింపులకు గురిచేస్తోందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ''అలా ఏమీ లేదు. కానీ, ఆ దిశగా అడుగులు వేస్తోంది. చాలా మంది అంచనాల కంటే బలంగా, వేగంగా ముందుకు వెళుతోంది'' అని వ్యాఖ్యానించారు.
 
లడాఖ్‌లో ఘర్షణ వాతావరణం ప్రారంభమైన సందర్భంలో, గల్వాన్‌ ఘటనా సమయంలోనూ ఇరు దేశాల మధ్య సయోధ్య కుదర్చడానికి తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్‌ తెలిపారు. ఆయన ప్రతిపాదనను ఉభయ దేశాలూ తిరస్కరించాయి. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు, ద్వైపాక్షిక చర్చల్లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం దౌత్య మార్గాల ద్వారా వివాదాల్ని పరిష్కరించుకుంటామని తెలిపాయి. ఇందులో ఇతర దేశాల జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments