Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరిగిన అమెరికా విమానం టికెట్‌ ధరలు

Webdunia
గురువారం, 22 జులై 2021 (08:11 IST)
అమెరికాకు వెళ్లేందుకు విమాన టికెట్‌ ధరలు అమాంతం పెరిగిపోయాయి. యూఎస్‌లో ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులకు ఇది శరాఘాతంగా పరిణమించింది. కరోనా పరిస్థితులతో పరిమిత సంఖ్యలో విమానాలు నడుస్తుండటం,మన దేశం నుంచి ఆ దేశానికి వెళ్లే విద్యార్థుల సంఖ్య భారీగా ఉండటం దీనికి ప్రధాన కారణంగా ఉంది.
 
కొవిడ్‌ వైరస్‌ రెండో దశ విజృంభణ నేపథ్యంలో భారత్‌ నుంచి వచ్చే విమానాలపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. అమెరికా నుంచి మాత్రం విమానాల రాకపోకలు సాగుతున్నాయి. అదీ ఆ దేశ పౌరులు, విద్యార్థి వీసా ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తోంది. 
 
అమెరికాతోపాటు మనదేశంలోనూ కరోనా రెండో దశ తీవ్రత తగ్గుముఖం పట్టటంతో దిల్లీలోని రాయబార కార్యాలయంతోపాటు ముంబయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతాలోని కాన్సులేట్‌ కార్యాలయాలను గడిచిన నెల నుంచి తెరిచింది.      
 
ఈ నెల చివరి వారం, ఆగస్టులో అక్కడి విశ్వవిద్యాలయాల్లో తరగతులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థి వీసాలను మాత్రమే జారీ చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. భారీ సంఖ్యలో స్టూడెంట్‌ వీసా ఇంటర్వ్యూలకు స్లాట్లను విడుదల చేసింది. 
 
హైదరాబాద్‌లో స్లాట్లు లభించని తెలుగు విద్యార్థులు దిల్లీ, ముంబయిలలో ఇంటర్వ్యూలకు కూడా హాజరయ్యారు. ఈ దఫా అధిక శాతం విద్యార్థులకు వీసాలు లభించినట్లు సమాచారం. దీంతో ఆ విద్యార్థులంతా అమెరికా వెళ్లేందుకు సన్నద్ధమవుతుండటంతో విమాన టికెట్లకు గిరాకీ ఏర్పడింది. ఇదిలా ఉంటే యూఎస్‌కు వెళ్లే విమాన సర్వీసుల సంఖ్యా తక్కువగా ఉండటంతో టికెట్‌ ధరలు భారీగా పెరిగాయి.            
 
సాధారణ రోజుల్లో హైదరాబాద్‌ నుంచి అమెరికా వెళ్లేందుకు రూ.60 వేలుగా ఉండే ఎకానమీ తరగతి టికెట్‌ ధర ప్రస్తుతం రూ.90 వేల నుంచి రూ.2.20లక్షల వరకూ ఉంది. అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌, ఎయిర్‌ ఇండియా, ఖతార్‌ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌ ఇండియా నడుపుతున్న విమానాల్లో మాత్రమే టికెట్‌ ధర కొంచెం తక్కువగా రూ.90 వేలు ఉంది.
 
కరోనా డెల్టా రకం భారతదేశం నుంచి వచ్చేవారి ద్వారా సోకుతోందన్న అపోహలు విస్తృతంగా ఉండటంతో రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నాయి. అమెరికా వెళ్లే విమానాల్లో అధిక శాతం దుబాయ్‌,దోహా, బ్రిటన్‌లలో ఏదో ఒక మార్గం నుంచి వెళుతుంటాయి. 
 
దుబాయ్‌, బ్రిటన్‌ దేశాలు భారతదేశం నుంచి అమెరికా వెళ్లే ప్రయాణికులకు ఆగేందుకు(ట్రాన్సిట్‌) అవకాశం లేకుండా గతంలో ఆంక్షలు విధించాయి. తాజాగా ఆ ఆంక్షలను ఈ నెల 31వ తేదీ వరకూ పొడిగించటంతో ఎమిరేట్స్‌,ఎతిహాద్‌ సంస్థలు తమ సర్వీసుల రద్దును పొడిగించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2: The Rule నటుడు శ్రీతేజ్ పెళ్లి చేసుకుంటానని మోసం: యువతి ఫిర్యాదు

ఫెస్టివల్స్ అనంతరం థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న వేదిక మూవీ ఫియర్

ఏఆర్.రెహ్మాన్ తండ్రిలాంటివారు... ఆ సంబంధం అంటగట్టొద్దు ప్లీజ్ : మోహిని డే

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments