Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్ మ్యాప్‌ ఎఫెక్ట్- భార్య ఒడిలో వేరొక వ్యక్తి.. అతని తలపై జుట్టును నిమురుతూ..?

Webdunia
శనివారం, 15 ఆగస్టు 2020 (14:46 IST)
Google map
గూగుల్ మ్యాప్ సాయంతో భార్య బండారాన్ని ఓ భర్త బయటపెట్టాడు. గూగుల్ మ్యాప్స్ ద్వారా దారి తెలుసుకోవచ్చునని అందరికీ బాగా తెలుసు. కానీ గూగుల్ మ్యాప్ వివాహేతర సంబంధాల్ని కూడా బయటపెట్టగలదని ఈ ఘటన ద్వారా తెలిసింది. గూగుల్ మ్యాప్ వారే వారు ఏ లొకేషన్‌లో ఎక్కడ  ఉన్నారో రికార్డ్ చేస్తుంది. అలాగే రెండు ప్రదేశాల మధ్య డిస్టాన్స్ కూడా చెబుతుంది.
 
గూగుల్ మ్యాప్స్‌లో రియల్ టైమ్ కార్లు, బైకులు, ల్యాంప్ పోస్టులు, ట్రాఫిక్ సిగ్నల్స్ వంటివి కూడా 360 డిగ్రీ కెమెరాలతో చూడొచ్చు. దీనివల్ల లాభాలున్నా.. కొందరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఒక్కోసారి ఈ యాప్, కొంపలు ముంచుతోంది. ఈ మధ్య గూగుల్ మ్యాప్స్‌లో కనిపించిన కొన్ని ఫొటోలను ఓ వ్యక్తి జాగ్రత్తగా చూశాడు. అందులో ఉన్నది తన భార్యేనని గుర్తించాడు.
 
కాకపోతే... పక్కన ఉన్న మగాడు మాత్రం తాను కాదు. దాంతో షాక్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. పెరూ దేశానికి చెందిన అతను... రాజధాని లిమాలోని పాపులర్ బ్రిడ్జికి వెళ్లి... అక్కడ స్ట్రీట్ వ్యూ ఆన్ చేశాడు. రకరకాల రూట్లు తెలుసుకుందామనుకున్నాడు. కానీ అక్కడే అసలు విషయం తెలిసింది. అక్కడ తీసిన ఫోటోల్లో తన భార్య ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం నెరపుతోందని తెలుసుకున్నాడు. 
 
టీషర్ట్, బ్లూ జీన్స్‌లో వున్న వ్యక్తి.. అతని భార్య పక్కనే బెంచీపై పడుకున్నాడు. ఆ ఫొటోలు జూమ్ చెయ్యగా... ఆమె అతని తలపై జుట్టును నిమురుతోంది. ఆమె వేసుకున్న బట్టల్ని బట్టీ... ఆమె తన భార్యేనని గుర్తించాడు. దీంతో భార్యను భర్త నిలదీశాడు. దీంతో వారిద్దరూ విడాకులు తీసుకున్నట్లు తెలిసింది. అదన్నమాట గూగుల్ మ్యాప్ కథ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deverakonda: తిరుపతిలో దేవరకొండ కింగ్‌డమ్ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

Sunny: సన్నీ లియోన్ నటించిన త్రిముఖ నుంచి ఐటెం సాంగ్ గిప్పా గిప్పా షూట్

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా సినిమా గుర్రం పాపిరెడ్డి నుంచి యోగిబాబు పోస్టర్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments