Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు గట్టిగా పట్టుకోండి... నవ వధువుపై భర్త రేప్, చంపేసిందంతే...

తనకు ఇష్టం లేకుండా లైంగిక సుఖం కోసం తనపై అత్యాచారం చేసినందుకు నవ వధువు తన భర్తను హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. దాంతో ఆ 19 ఏళ్ల యువతికి కోర్టు మరణ దండన విధించింది. ఈ ఘటన సూడాన్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే... తనకు ఇష్టం లేకుండా యువతి తల్లిదండ్రులు

Webdunia
శనివారం, 12 మే 2018 (17:44 IST)
తనకు ఇష్టం లేకుండా లైంగిక సుఖం కోసం తనపై అత్యాచారం చేసినందుకు నవ వధువు తన భర్తను హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. దాంతో ఆ 19 ఏళ్ల యువతికి కోర్టు మరణ దండన విధించింది. ఈ ఘటన సూడాన్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే... తనకు ఇష్టం లేకుండా యువతి తల్లిదండ్రులు వివాహం జరిపించారు. ఐతే గత ఏప్రిల్ నెలలో ఆమె తనకు వివాహం ఇష్టం లేదని పుట్టింటికి తిరిగొచ్చింది. కానీ, ఆ తర్వాత ఆమె భర్త వచ్చి తనను తీసుకుని వెళ్లాడు. శోభనం ఏర్పాట్లు చేశారు. ఆమె మాత్రం ససేమిరా అన్నది. దాంతో ఆమెను దారిలోకి తెచ్చుకునేందుకు ఆరు రోజుల పాటు ఆ యువకుడు ఎదురుచూశాడు. అయినప్పటికీ ఆమె తనకు ఇష్టం లేదని తేల్చి చెప్పింది. 
 
ఇక లాభం లేదనుకున్న యువకుడు తన బంధువులను పిలిచి విషయం చెప్పాడు. ఆమెను గట్టిగా పట్టుకోవాలని చెప్పి, వారలా ఆమెను పట్టుకున్న సమయంలో ఆమెను బలవంతంగా అత్యాచారం చేశాడు. ఆమె తనకు ఇష్టం లేదని మొత్తుకుంటున్నా అతడు మాత్రం వదల్లేదు. మళ్లీ రెండో రోజు కూడా అలాగే చేసేందుకు బంధువులను పిలిచాడు. ఇంతలోనే ఆమె ఆగ్రహంతో భర్తపై దాడి చేసి హత్య చేసింది. ఈ పరిణామానికి అంతా షాకయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కోర్టు విచారించింది. సూడాన్‌లో స్త్రీలు పురుషులకు ఎదురుతిరక్కూడదు. 
 
ఆమె భర్తను ఎదిరించడమే కాకుండా అతడిని హత్య చేసినందుకు మరణ దండన విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఐతే ఆమె తల్లిదండ్రులు తన బిడ్డకు ఇష్టం లేకుండా పెళ్లి చేసినందుకు ఆవేదన వ్యక్తం చేస్తూ తనను తను కాపాడుకునేందుకు ఇలా ప్రవర్తించిందనీ, ఆమెకు క్షమాభిక్ష ప్రసాదించాలని కోర్టుకు విన్నవించుకున్నారు. కాగా సూడాన్‌లో అమ్మాయిలకు చిన్న వయసులోనే పెళ్లి చేయడం, వారిని హింసించడం సర్వసాధారణం. దీనిపై అంతర్జాతీయంగా నిరసనలు వచ్చినా ఆ దేశం మాత్రం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం