Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుట్టు చప్పుడుకాకుండా నేహా దుపియ వివాహం... ఎందుకో తెలుసా?

బాలీవుడ్ హీరోయిన్ నేహా దుపియా వివాహం గుట్టుచప్పుడు కాకుండా జరిగింది. ఈమె తెలుగులో ఐదు సినిమాల్లోనూ నటించారు. జూలీ, నిన్నే ఇష్టపడ్డాను, విలన్, పరమవీర చక్ర చిత్రాల్లో నటించారు.

Advertiesment
గుట్టు చప్పుడుకాకుండా నేహా దుపియ వివాహం... ఎందుకో తెలుసా?
, శుక్రవారం, 11 మే 2018 (11:20 IST)
బాలీవుడ్ హీరోయిన్ నేహా దుపియా వివాహం గుట్టుచప్పుడు కాకుండా జరిగింది. ఈమె తెలుగులో ఐదు సినిమాల్లోనూ నటించారు. జూలీ, నిన్నే ఇష్టపడ్డాను, విలన్, పరమవీర చక్ర చిత్రాల్లో నటించారు. అలాంటి హీరోయిన్ ఉపుడు చడీచప్పుడు కాకుండా పెళ్లి చేసుకోవడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది.
 
భారత క్రికెట్‌‌లో దిగ్గజ స్పిన్నర్‌‌గా పేరుపొందిన బిషన్‌ సింగ్‌ బేడీ కుమారుడు అంగద్‌ బేడీని ఆమె పెళ్లి చేసుకున్నారు. అంగద్‌ బాలీవుడ్‌, టీవీ రంగంలో నటుడిగా ఉన్నాడు. బుధవారం మే 10వ తేదీ పంజాబీ సంప్రదాయంలో జరిగిన ఈ వేడుక జరిగింది. రెండు కుటుంబాలు, అతి కొద్దిమంది సన్నిహితులకు మాత్రం ఆహ్వానం పంపారు.
 
పెళ్లి దుస్తుల్లో మెరిపోతున్న ఫొటోలను.. స్వయంగా వధూవరులే పోస్ట్‌ చేశారు. జీవితంలో తీసుకున్న మంచి నిర్ణయం ఇదే... నా ఫ్రెండ్‌ అంగద్‌‌ను పెళ్లి చేసుకున్నాను. హలో.. హస్బెండ్‌‌గారు అంటూ నేహా దుపియా ట్వీట్ చేసింది. దీనికి అంగద్ కూడా రీట్వీట్ చేశాడు. నేహాదూపియా ఇప్పటి వరకు స్నేహితురాలు.. ఇక నుంచి భార్య అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 
 
సోనమ్ పెళ్లి హడావిడిలో ఉన్న బాలీవుడ్ అభిమానులు అంతా.. ఒక్కసారిగా నేహా దూపియా పెళ్లి అయిపోయింది అని తెలిసి షాక్ అయ్యారు. ఎలాంటి హంగామా లేకుండా ఇంత సింపుల్‌గా చేసుకుంటారా అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. సోనమ్ కపూర్ పెళ్లిని చూడండి.. మరో వార్తే లేదన్నట్లు అందరూ ఫాలో అయిపోయారు.. మీరేమో ఎవరికీ తెలియకుండా ఇలా చేసుకుంటారా అంటూ వెటకారాలు ఆడుతున్నారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బన్నీ చేసిన ఆర్య సినిమా అంటే నాకు చాలా ఇష్టం: పవన్ కల్యాణ్