Webdunia - Bharat's app for daily news and videos

Install App

లెబనాన్‌ పోర్టులో భారీ పేలుడు.. పదిమంది మృతి.. వందలాది మందికి..? (video)

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (00:47 IST)
Lebanon
కరోనా కారణంగా ఇప్పటికే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. మరోవైపు ప్రకృతీ వైపరీత్యాలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో లెబనాన్‌లో భారీ పేలుడు సంభవించింది. లెబనాన్‌ రాజధాని బీరట్‌లో రెండు పేలుళ్లు జరిగినట్లు భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. 
 
పేలుళ్ల ధాటికి సమీపంలోని పలు భవనాలు కుప్పకూలాయి. ఆ ప్రాంతంలో భారీగా మందుగుండు సామగ్రిని నిల్వ ఉంచడంతో ఒక్కసారిగా పేలిపోయినట్లు ప్రజారక్షణ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ వెల్లడించారు. సహాయక సిబ్బంది సంఘటన స్థలికి చేరుకొని క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ ఘటనలో అనేక మంది గాయాలపాలయ్యారు. పది మంది మృతి చెందారు. భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది.  
 
రాజధాని నగరమంతా ఈ భారీ పేలుడుతో పొగ వ్యాపించింది. అనేక భవనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. బీరూట్ పోర్టు సమీపంలో ఈ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనతో భారీ విధ్వంసమే జరిగింది. సెంట్రల్ బీరూట్‌లో జరిగిన ఈ పేలుడు కారణంగా వందలాది మంది గాయాలపాలయ్యారు.  
 
పేలుళ్లతో భారీ స్థాయిలో ఆస్తి నష్టం సంభవించిందని అధికారులు చెప్పారు. పోర్టులో ఉంచిన బాణాసంచా, పేలుడు పదార్థాల కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి. కాగా, ఈ పేలుడుతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments