Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి కుదిర్చారు... కానీ పెళ్లికి ముందే ఏకాంతంగా కనబడ్డారని చంపేశారు...

మానవ విలువలకు ఏమాత్రం స్థానం వుండదు పాకిస్తాన్ దేశంలో. అక్కడ ఎవడు ఎలా అనుకుంటే అలా జరిగిపోతుందంతే. ప్రాణానికి విలువే లేదు. క్షణాల్లో హత్య చేసి ఏమీ జరగనట్లు ప్రవర్తించేవాళ్లు ఎక్కువగా ఉంటుంటారు. ముఖ్యం

Webdunia
శనివారం, 6 జనవరి 2018 (14:37 IST)
మానవ విలువలకు ఏమాత్రం స్థానం వుండదు పాకిస్తాన్ దేశంలో. అక్కడ ఎవడు ఎలా అనుకుంటే అలా జరిగిపోతుందంతే. ప్రాణానికి విలువే లేదు. క్షణాల్లో హత్య చేసి ఏమీ జరగనట్లు ప్రవర్తించేవాళ్లు ఎక్కువగా ఉంటుంటారు. ముఖ్యంగా పాకిస్తాన్ దేశంలో పరువు హత్యలు రోజురోజుకీ ఎక్కువయిపోతున్నాయి. తాజాగా జరిగిన ఓ పరువు హత్య షాక్ కు గురి చేస్తోంది. ఎందుకంటే ఇది ప్రేమించుకున్నవారి విషయంలో జరిగింది కాదు. 
 
పెద్దలు కుదిర్చిన సంబంధంతో త్వరలో పెళ్లి చేసుకోవాల్సిన జంటను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన. వివరాల్లోకి వెళితే... సింధ్‌ ప్రావిన్స్‌లో నయీ వహీ గ్రామానికి చెందిన నజ్రీమ్‌ అనే యువతికి తన బంధువైన షాహిద్‌ అనే వ్యక్తితో పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. పెళ్లి జరిగేందుకు మరికొన్ని రోజులున్నాయి. 
 
ఐతే ఈలోపు ఈ జంట హాయిగా అలాఅలా ఊరి బయటకు విహారానికి వెళ్లింది. వాళ్లిద్దరూ ఊరి చివరకు వెళ్లి ఏకాంతంగా మాట్లాడుకుంటున్నారు. అంతే... వీరిని అలా చూసిన నజ్రీమ్ మేనమామ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. పెళ్లి కాక మునుపే ఏంటా ముచ్చట్లు అంటూ తుపాకి తీసి వారిని అత్యంత దారుణంగా కాల్చి చంపేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. కాగా పాకిస్తాన్ దేశంలో ఇలాంటి పరువు హత్యలు సర్వసాధారణమైపోయాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments