Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కార్తీక్ వద్ద లభించిన సుఖం భర్త వద్ద పొందలేకపోయా... అందుకే చంపేశా.. జ్యోతి

పెళ్లి కాకముందు.. పెళ్లి అయిన తర్వాత తన ప్రియుడు కార్తీక్ ఇచ్చిన శృంగార సుఖాన్ని వివాహమైన తర్వాత తన భర్త వద్ద పొందలేక పోయాననీ, అందుకే భర్త అడ్డు తొలగించుకుని శాశ్వతంగా ప్రియుడితోనే ఉండిపోవాలని నిర్ణయి

కార్తీక్ వద్ద లభించిన సుఖం భర్త వద్ద పొందలేకపోయా... అందుకే చంపేశా.. జ్యోతి
, శుక్రవారం, 5 జనవరి 2018 (14:35 IST)
పెళ్లి కాకముందు.. పెళ్లి అయిన తర్వాత తన ప్రియుడు కార్తీక్ ఇచ్చిన శృంగార సుఖాన్ని వివాహమైన తర్వాత తన భర్త వద్ద పొందలేక పోయాననీ, అందుకే భర్త అడ్డు తొలగించుకుని శాశ్వతంగా ప్రియుడితోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నట్టు భర్తను చేసిన కేసులో ప్రధాన నిందితురాలైన భార్య జ్యోతి చెప్పుకొచ్చింది. 
 
పాలమూరు జిల్లాకు చెందిన కార్పెంటర్ అయిన నాగరాజుకు, జ్యోతికి ఐదేండ్ల క్రితం వివాహమైంది. వీరికి బాబు, ఒక పాప ఉన్నారు. వివాహం అయినప్పటి నుంచి లాలాపేటలో నివాసముంటున్నారు. అయితే జ్యోతి నాచారంలో ఆరేండ్ల కింద తమ బంధువుల పెళ్లికి వెళ్లగా అక్కడ కార్తీక్ అనే యువకుడు పరిచయమయ్యాడు. మూడు, నాలుగు నెలల తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ విషయం జ్యోతి ఇంట్లో తెలియడంతో.. ఆమెను మందలించారు. 
 
ఇక 2012లో నాగరాజుకు జ్యోతిని ఇచ్చి పెళ్లి చేశారు. బాబు, పాప ఉన్నప్పటికీ.. జ్యోతికి ప్రియుడిపై మోజు పడింది. తన ప్రియుడిని రహస్యంగా కలుసుకుంటూ శారీరకసుఖం పొందుతూ వచ్చింది. ఈ అయితే, శాశ్వతంగా చెంతనే ఉండాలని భావించిన జ్యోతి, ప్రియుడు, అతని స్నేహితుల సహకారంతో భర్తను చంపేసింది. 
 
అయితే, నాగరాజును హత్య చేసిన నిందితుల్లో ఒకరైన నరేష్ గురువారం లాలాపేటలో గొంతుకోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. ఈ హత్య కేసులో తన ఒక్కడినే ఇరికించే ప్రయత్నం జరుగుతుందని నరేష్ ఆరోపించాడు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నరేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి.. నాగరాజు హత్య కేసును ఛేదించారు. 
 
అనంతరం జ్యోతి వద్ద విచారణ జరుపగా, కార్తీక్‌తో శాశ్వతంగా ఉండేందుకే తన భర్తను చంపినట్టు తెలిపింది. ముఖ్యంగా తన భర్త వద్ద సంతృప్తికరమైన దాంపత్య సుఖం పొందలేక పోయాయని, దాన్ని కార్తీక్ వద్ద పొందడం వల్లే ఈ దారుణానికి పాల్పడినట్టు వాంగ్మూలం ఇచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కారు నడిపేటపుడు మీ బ్రెయిన్ ఉపయోగించడంలేదా? ఐతే మీ కారు ఉపయోగిస్తుంది...