Webdunia - Bharat's app for daily news and videos

Install App

యజమానురాలు చనిపోయింది.. సమాధివద్దే పిల్లి తిష్ట.. రోజూ మృతురాలి పిల్లల్ని కూడా చూసొస్తుంది..?

కుక్కలు తమ యజమానుల పట్ల విశ్వాసం చూపుతాయి. అది వాటి సహజ లక్షణం. యజమానుల పట్ల విశ్వాసం చూపే పిల్లులు ఎక్కడైనా ఉంటాయా? లోకంలో అలాంటి పిల్లులు కూడా ఉంటాయని ఆశ్చర్యం కలుగుతుంది. అయితేనేం, ఫొటోలో కనిపిస్తు

Webdunia
గురువారం, 3 నవంబరు 2016 (10:38 IST)
కుక్కలు తమ యజమానుల పట్ల విశ్వాసం చూపుతాయి. అది వాటి సహజ లక్షణం. యజమానుల పట్ల విశ్వాసం చూపే పిల్లులు ఎక్కడైనా ఉంటాయా? లోకంలో అలాంటి పిల్లులు కూడా ఉంటాయని ఆశ్చర్యం కలుగుతుంది. అయితేనేం, ఫొటోలో కనిపిస్తున్న ఈ పిల్లిని మాత్రం విశ్వాసానికి మారుపేరుగా చెప్పుకోవచ్చు. విశ్వాస ప్రదర్శనలో దీని తీరు జాగిలాలకు సాటి వస్తుంది. అయితే, పాపం దీని యజమానులే దీని ప్రేమను నోచులేకపోయారు. 
 
తనను పెంచిన యజమానురాలిపై ఈ పిల్లి చూపించిన ప్రేమ, విశ్వాసం చూస్తే ఎవ్వరికైనా గుండె బరువెక్కుతుంది. ఆ వివరాలను పరిశీలిస్తే... ఇండోనేషియా దేశంలోని సెంట్రల్ జావా ప్రాంతానికి చెందిన కుందరి అనే వృద్ధురాలు ఈ పిల్లిని పెంచుకుంది. వృద్ధాప్యం వల్ల కుందరి మరణించడంతో కుటుంబసభ్యులు ఆమె మృతదేహాన్ని శ్మశానవాటికలో ఖననం చేశారు. తన యజమానురాలిని ఖననం చేసిన సమాధి వద్దకు పిల్లి దాదాపు ఏడాది కాలంగా వెళ్తూ అక్కడే ఉంటోంది. శ్మశానవాటికకు సమీపంలో వచ్చిపోయేవారు ఆ పిల్లికి ఆహారం, నీరు అందించినా అది తీసుకోవడం లేదట. 
 
ఇక్కడ విచిత్రం ఏమంటే ప్రతిరోజూ పిల్లి యజమానురాలి ఇంటికి వెళ్లి అక్కడ మృతురాలి పిల్లల్ని చూసి మళ్లీ  సమాధి వద్దకు తిరిగొచ్చేస్తుందట. ఆ పిల్లిని తాను పెంచుకునేందుకు చూసినా యజమానురాలి సమాధి వీడి రావడం లేదని కెలి ప్రేట్నో చెప్పారు. తనను పెంచిన యజమానురాలిపై పిల్లి చూపిస్తున్న ప్రేమ, విశ్వాసం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments