Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిప్పు సుల్తాన్ స్వాతంత్ర్య సమరయోధుడు కాదని.. రాజ్యానికి రాజు మాత్రమే: కర్ణాటక హైకోర్టు

టిప్పు సుల్తాన్ స్వాతంత్ర్య సమరయోధుడు కాదని.. చరిత్రను బట్టి చూస్తే టిప్పు సుల్తాన్ ఓ రాజ్యానికి రాజు మాత్రమే కర్ణాటక హైకోర్టు తేల్చి చెప్పేసింది. హైసొద్‌లూరుకు చెందిన మంజునాథ్ కేపీ(40) అనే వ్యక్తి ప్

Webdunia
గురువారం, 3 నవంబరు 2016 (10:28 IST)
టిప్పు సుల్తాన్ స్వాతంత్ర్య సమరయోధుడు కాదని.. చరిత్రను బట్టి చూస్తే టిప్పు సుల్తాన్ ఓ రాజ్యానికి రాజు మాత్రమే కర్ణాటక హైకోర్టు తేల్చి చెప్పేసింది. హైసొద్‌లూరుకు చెందిన మంజునాథ్ కేపీ(40) అనే వ్యక్తి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. టిప్పు సుల్తాన్ జయంతిని ప్రభుత్వం నిర్వహించకుండా ఆదేశించాలని కోర్టును కోరారు.
 
ఈ నేపథ్యంలో టిప్పు సుల్తాన్ జయంతిని ఎందుకు నిర్వహించాలని అనుకుంటున్నారని చీఫ్ జస్టిస్ ఎస్‌కే ముఖర్జీ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వం తరపు లాయర్ ఎంఆర్ నాయక్ తన వాదనలు వినిపిస్తూ టిప్పు సుల్తాన్ గొప్ప యోధుడని, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడాడని, స్వాతంత్ర్య సమరయోధుడు కావడం వల్లే జయంతిని నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. 
 
దీనికి చీఫ్ జస్టిస్ ముఖర్జీ స్పందిస్తూ.. తనకు తెలిసినంత వరకు టిప్పు సుల్తాన్ స్వాంతంత్ర్య సమరయోధుడు కాదని, అలాంటప్పుడు ఆయన జయంతిని నిర్వహించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments