Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు ఇంజినీర్ శ్రీనివాస్ మృతి.. ఊసెత్తని ట్రంప్.. ఆపై దురుసుగా వ్యాఖ్యలు.. ఏంటిది?

తెలుగు ఇంజినీర్ శ్రీనివాస్ అమెరికాలో దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దేశంలోని ప్రముఖులు, సెలెబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. అమెరికాలో ఇలాంటి ఘటనలు దారుణమని వ్యాఖ్యానిస్తున్నారు

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2017 (10:59 IST)
తెలుగు ఇంజినీర్ శ్రీనివాస్ అమెరికాలో దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దేశంలోని ప్రముఖులు, సెలెబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. అమెరికాలో ఇలాంటి ఘటనలు దారుణమని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అమెరికాలో భారతీయ ఇంజినీర్‌పై జరిగిన ఈ దురాగతంపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోరెత్తలేదు. 
 
అమెరికాలో విదేశీయులపై జాతి వివక్ష దాడులు, కాల్పులు జరుగుతున్నప్పటికీ.. ట్రంప్ ఏమాత్రం స్పందించలేదు. ఇంకా ట్రంప్ నోటిదురుసు కూడా తగ్గలేదు. 
 
కన్సర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్‌లో తెలుగు ఇంజినీర్ శ్రీనివాస్ దుర్మరణంపై ట్రంప్ మాట్లాడుతారు అనుకుంటే.. ఆయన ఆ మాటెత్తలేదు సరికదా.. దురుసుగా మాట్లాడారు. అమెరికా పౌరుల రక్షణ కోసం పాటుపడతానని, అమెరికన్లకే ఉద్యోగాలను కల్పిస్తామని పునరుద్ఘాటించారు. 
 
ఇంకా ట్రంప్ మాట్లాడుతూ.. తాను కేవలం అమెరికాకు మాత్రమే అధ్యక్షుడినని.. ప్రపంచం మొత్తానికి కాదని తేల్చి చెప్పారు. ఒక్కో దేశానికి ఒక్కో జెండా.. ఒక్కో జాతీయ గీతం ఉన్నట్లు.. తన దేశంపైనే తాను దృష్టి పెడతానన్నారు. కానీ గతకొంత కాలంగా షికాగో ప్రాంతంలో చోటుచేసుకున్న తుపాకీ కాల్పుల్లో ఏడుగురు చనిపోవడంపై ట్రంప్ ట్విట్టర్లో స్పందించారు. వారి మృతి పట్ల సంతాపం ప్రకటించారు. దీంతో ట్రంప్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నారైలపై ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటుంటే అధ్యక్షుడైన ట్రంప్ నోరెత్తకపోవడం దారుణమని వారు ఫైర్ అవుతున్నారు. 

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments