Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైతీ భూకంప మృతులు రూ.2 వేలు : 10 వేల మందికి గాయాలు

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (11:39 IST)
హైతీ భూకంప మృతుల సంఖ్య రెండు వేలకు చేరుకున్నాయి. ఈ భూకంపంలో గాయపడిన వారి సంఖ్య పది వేలు దాటిపోయాయి. గత వారాంతం సంభవించిన ఈ భారీ భూకంప విలయం నుంచి కోలుకోకముందే పెను తుపాను విరుచుకుపడింది. 
 
దీంతో సహాయకచర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఇదిలావుంటే, ఈ ఘోర భూకంప విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మంగళవారం నాటికి దాదాపు 2 వేలకు చేరుకుంది. మరో 10వేల మంది గాయాలపాలయ్యారు. 
 
గత శనివారం 7.2 తీవ్రతతో భారీ భూకంపం హైతీ దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ విపత్తులో 1,941 మంది మరణించినట్లు ఆ దేశ సివిల్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ మంగళవారం రాత్రి వెల్లడించింది. ఇక 9,900 మంది గాయపడ్డారని, వీరిలో చాలా మందికి ఇంకా వైద్య సాయం అందకపోవడంతో ఆసుపత్రుల వద్ద పడిగాపులు కాస్తున్నారని పేర్కొంది. 
 
ఈ పెను విధ్వంసానికి ఇళ్లు, భవనాలు పూర్తి నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారు. వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. అయితే, దెబ్బ మీద దెబ్బలా.. ఇప్పుడు హైతీపై గ్రేస్‌ తుపాను కూడా విరుచుకుపడింది. నిన్న చాలా ప్రాంతాలో భారీవర్షం కురిసింది. దీంతో సహాయకచర్యలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అశ్విన్ పులిహార బాగా కలుపుతాడు - వెండితెర పై క్రికెటర్ కూడా : థమన్

కన్నప్ప కామిక్ బుక్ ఫైనల్ చాప్టర్ కాన్సెప్ట్ వీడియో విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments