Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెనెడా ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి.. ప్రభుత్వ ఖాతాలు హ్యాక్

Webdunia
సోమవారం, 17 ఆగస్టు 2020 (08:30 IST)
కెనాడాలో భారీ సైబరీ దాడి జరిగింది. ఆన్‌లైన్‌ ప్రభుత్వ సేవాలకు సంబంధించిన వేలాది ఖాతాలు హ్యాకింగ్‌కు గురైనట్లు ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. సుమారు 30 సమాఖ్య విభాగాలు, రెవెన్యూ ఏజెన్సీ ఖాతాలు ఉపయోగించే జీసీకీ సేవను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగాయని ట్రెజరీ బోర్డ్ ఆఫ్ కెనడా సెక్రటేరియట్ వివరించింది.

9,401 మంది జీసీకీ ఖాతాదారుల పాస్‌వర్డ్‌లను సైబర్‌ నేరగాళ్లు దొంగిలించారని గుర్తించామని, అన్నింటిని వెంటనే తొలగించామని కెనడా ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. అలాగే 5,500 రెవెన్యూ ఏజెన్సీ ఖాతాలను లక్ష్యంగా చేసుకొని మరో దాడి చేశారని, హ్యాకింగ్‌కు గురైన అకౌంట్లను వెంటనే గుర్తించి తొలగించామని చెప్పారు.
 
పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఖాతాలు హాకింగ్‌కు గురికావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. గోప్యత ఉల్లంఘనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించింది.

కాగా, రెవెన్యూ ఏజెన్సీ ఖాతాలతో సంబంధం ఉన్న బ్యాంకింగ్‌ సమాచారం మార్చబడిందని ఆగస్ట్‌ మొదటి వారంలోనే చాలా మంది కెనెడియన్లు ఫిర్యాదు చేసిన ప్రభుత్వం పట్టించుకోనేట్లు తెలుస్తోంది. ఫలితంగా కరోనావైరస్‌ సంక్షోభ సమయంలో ప్రభుత్వం అందిచిన ఆర్థిక సాయం అర్హులకు అందకుండా పోయిందని ఆ దేశ మీడియా పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments