Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొటబాయ రాజపక్సేకు షాకిచ్చిన సింగపూర్

Webdunia
సోమవారం, 18 జులై 2022 (13:38 IST)
దేశాన్ని పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో నెట్టేసి ఆ దేశం నుంచి పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సేకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొలుత ఆయన కొలంబో నుంచి మాల్దీవులకు వెళ్లారు. అక్కడ శ్రీలంక జాతీయులు ఆయనకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చిన నిరసన తెలిపారు. దీంతో ఆయన అక్కడ నుంచి సింగపూర్‌లో అడుగుపెట్టారు. 
 
అయితే ఇప్పుడు ఆయన తమ దేశం వీడాలని సింగపూర్ కోరుకుంటోంది. ఆయన తమ దేశంలో ఉండేందుకు గడువును పొడిగించలేమని ఆ దేశ అధికారులు గొటబాయకు తేల్చిచెప్పినట్లు సమాచారం. 
 
శ్రీలంక ప్రజల ఆగ్రహ జ్వాలలను తట్టుకోలేని గొటబాయ.. భార్యతో కలిసి మొదట మాల్దీవులకు వెళ్లిపోయారు. ఆ తర్వాత గురువారం సింగపూర్ చేరుకున్నారు. ఆ దేశంలో దిగే సమయానికి ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేయలేదు. ఆయన అధ్యక్ష హోదాలో వ్యక్తిగత పర్యటనకు వచ్చారని అప్పుడు సింగపూర్ ప్రభుత్వం చెప్పింది. 
 
అయితే ఆయన మరికొన్ని రోజులు తమ దేశంలో ఉండేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఆయన ఆశ్రయం కోరలేదని, తాము కూడా ఎలాంటి ఆశ్రయం ఇవ్వలేదని సింగపూర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆయన కొద్ది రోజుల క్రితమే అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో సింగపూర్‌ నుంచి ఈ స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments