Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గొటబాయ రాజపక్సేకు మాలేలోనూ తప్పని నిరసనల సెగ

Advertiesment
sri lanka
, గురువారం, 14 జులై 2022 (11:25 IST)
శ్రీలంక దేశాన్ని దివాళా తీసి మాల్దీవులకు పారిపోయిన ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే ఎక్కడకు వెళ్లినా నిరసనల సెగ తప్పడం లేదు. ఆయన మాల్దీవుల్లోని మాలేలో ఆశ్రయం పొందుతున్నారు. అయితే, అక్కడ శ్రీలంక జాతీయులు గొటబాయకి వ్యతిరేకంగా ప్లకార్డులు చేతబట్టి తమ నిరసన తెలిపారు. గొటబాయని శ్రీలంకకు వెనక్కి తిప్పి పంపాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. 
 
కాగా, రెండు రోజుల క్రితం గొటబాయ తన భార్య, ఇద్దరు బాడీగార్డుతో కలిసి మాల్దీవులకు చేరుకున్న విషయం తెల్సిందే. ఈ విషయం మాలేలని నగరంలోని శ్రీలంక జాతీయులు ఈ నిరసన ప్రదర్శన చేశారు. గొటబాయని శ్రీలంకకు తిప్పి పంపాలంటూ వారు నినాదాలు చేశారు. 
 
మరోవైపు, తమ దేశంలోకి శ్రీలంక అధ్యక్షుడు గొటబాయని అనుమతించడంపో మాల్దీవ్స్ నేషనల్ పార్టీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. శ్రీలంక ప్రజల మనోభావాలను మాల్దీవుల ప్రభుత్వం ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని ఎంఎన్‌పీ నేత దున్యా మౌమూన్ విమర్శలు గుప్పించారు. దీనిపై ప్రభుత్వం నుంచి వివరణ కోరుతూ తీర్మానం ప్రవేశపెడతామని ఆయన తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతీయ దంపతుల వద్ద 45 పిస్టల్స్ స్వాధీనం