Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోబోలను చంద్రుడిపైకి పంపండి.. రూ.136 కోట్లు గెలుచుకోండి.. పోటీలో ఇండస్...

రోబోల అభివృద్ధికి ఇంజనీర్లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, పరిశోధకులను ప్రోత్సహించేందుకు రూ.205 కోట్లు గూగూల్‌ లూనార్‌ ఎక్స్‌ప్రైజ్‌, గూగుల్‌, ఎక్స్‌ప్రైజ్‌ సంస్థలు సంయుక్తంగా ప్రకటించాయి. కేవలం ప్రైవే

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2016 (12:46 IST)
రోబోల అభివృద్ధికి ఇంజనీర్లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, పరిశోధకులను ప్రోత్సహించేందుకు రూ.205 కోట్లు గూగూల్‌ లూనార్‌ ఎక్స్‌ప్రైజ్‌, గూగుల్‌, ఎక్స్‌ప్రైజ్‌ సంస్థలు సంయుక్తంగా ప్రకటించాయి. కేవలం ప్రైవేటు వ్యక్తులు, సంస్థలే ఈ బహుమతికి అర్హులని ప్రకటించాయి. అయితే ఈ బహుమానాన్ని గెలుచుకోవాలంటే.. స్వయంగా తయారు చేసిన అంతరిక్ష నౌకను చంద్రుడిపైకి పంపాలి.
 
భారత్‌ నుంచి ‘టీం ఇండస్‌’‌ అనే కంపెనీ మాత్రమే ఈ పోటీలో పాల్గొంటోంది. ఈ నౌకను చంద్రుడిపై 500 మీటర్లు ప్రయాణింప చేయాలని గూగుల్ లునార్ తెలిపింది. తర్వాత దీని ద్వారా చంద్రుడి హైడెఫినేషన్‌ వీడియో, ఫొటోలను భూమికి చేర్చాలి. ఈ పోటీలో పాల్గొనే వారు మిషన్‌ మొత్తం ఖర్చులో 10 శాతానికి మించి ప్రభుత్వం నుంచి సహాయం తీసుకోకూడదని వెల్లడించింది. 
 
90 శాతం నిధులు ప్రైవేటు సంస్థల నుంచే సమకూర్చుకోవాలి. పోటీలో పాల్గొనాలంటే డిసెంబరు 31, 2016 కల్లా నమోదు చేసుకోవాలి. 2017 చివరి నాటికి ఈ మిషన్‌ పూర్తి చేయాలి. మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేస్తే.. మొదటి బహుమతి కింద 2 కోట్ల డాలర్లు( రూ.136 కోట్లు), రెండో బహుమతి కింద 50 లక్షల డాలర్లు (రూ.34 కోట్లు), బోనస్‌ బహుమతి కింద 50 లక్షల డాలర్లు ఇవ్వనున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అంటున్న డకాయిట్ టీమ్

వైలెంట్ - సైలెంట్ ప్రేమకథ - ఫ్లాప్ వచ్చిన ప్రతిసారీ మారాలనుకుంటా : అల్లరి నరేష్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

తర్వాతి కథనం
Show comments