Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాయు కాలుష్యం.. ఏడాదికి 16లక్షల మంది మృతి.. పదిదేశాల్లో భారత్‌

వాయు కాలుష్యంతో మృతుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. వాయు కాలుష్యంతో ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు నానా తంటాలు పడుతుంటే.. గత ఏడాదికాలంలో భారత్, చైనా దేశాల్లో 16 లక్షలమంది మరణించారని తాజాగా వెల్లడ

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2016 (12:10 IST)
వాయు కాలుష్యంతో మృతుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. వాయు కాలుష్యంతో ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు నానా తంటాలు పడుతుంటే.. గత ఏడాదికాలంలో భారత్, చైనా దేశాల్లో 16 లక్షలమంది మరణించారని తాజాగా వెల్లడైంది. పారిశ్రామికాభివృద్ధి వల్ల వాయు కాలుష్యం పెరిగి జనం మనుగడకే ప్రమాదం వాటిల్లుతుందని గ్రీన్ పీస్ అనే సంస్థ తెలిపింది. గ్రీన్ పీస్ సంస్థలో జరిపిన సర్వేలో.. వాహనాల పొగతో పాటు బొగ్గు కాల్చడం ద్వారా అధికంగా కాలుష్యం వెలువడుతుందని పేర్కొంది. 
 
వాయు కాలుష్య మరణాలు ఎక్కువగా సంభవిస్తున్న పది దేశాల్లో భారతదేశం ఉందని తేలింది. భారత్, చైనా దేశాలు వాయు కాలుష్యం పెరిగినా ఆర్థికాభివృద్ధి సాధించాయని తెలిపింది. రెండు దేశాల్లోనూ బొగ్గు వినియోగం పెరగటం వల్ల కాలుష్యం పెరిగిందని నివేదిక తేల్చింది. రెండు దేశాల్లోనూ లక్షమందిలో వాయుకాలుష్యం 115 నుంచి 138 మందిని ప్రభావితం చేసిందని గ్రీన్ పీస్ వివరించింది. అధిక ఆదాయం వస్తున్న దేశాలతో పోలిస్తే మన దేశంలో వాయుకాలుష్యం వల్ల మరణాల సంఖ్య నాలుగురెట్లు పెరిగింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments