Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోయింగ్ స్పేస్ క్యాప్సుల్ సురక్షితంగా భూమికి చేరుస్తుంది : సునీతా విలియమ్స్

వరుణ్
గురువారం, 11 జులై 2024 (17:33 IST)
బోయింగ్ సంస్థ తయారు చేసిన వ్యోమనౌక (స్పేస్ క్యాప్సుల్) తమను సురక్షితంగా భూమికి చేర్చగలదన్న నమ్మకం తమకుందని అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్ అన్నారు. బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ క్యాప్సులు పరీక్షించేందుకు సునీతా, బుచ్ అంతరిక్ష యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. నాసాకు చెందిన కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇరు వ్యోమగాములు స్టార్ లైనర్‌లో స్పేస్ స్టేషన్‌కు వెళ్లారు.
 
రెండు వారాల క్రితమే వారు భూమికి తిరిగి రావాల్సిన ఉండగా పలు సాంకేతిక సమస్యల కారణంగా ప్రయాణం వాయిదా పడుతూవస్తోంది. కాగా, వారు ఎప్పుడు తిరిగిరావాలన్న దానిపై తాము ఎటువంటి తేదీ నిర్ణయించలేదని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కొన్ని రోజుల క్రితం ప్రకటించింది. వారి తిరుగు ప్రయాణంపై తొందరేమీ లేదని స్పష్టం చేసింది.
 
కాగా, జూన్ 5వ తేదీన సునీతా విలియమ్స్, బుచ్ అంతరిక్ష యాత్రను ప్రారంభించిన విషయం తెల్సిందే. ఐఎస్ఎస్ చేరుకునే క్రమంలో స్టార్‌లైన్‌లో హీలియం వాయువు లీకవడాన్ని గుర్తించారు. క్యాప్సుల్ దిశను మార్చే థ్రస్టర్లలో హీలియంను వినియోగిస్తారు. అయితే, వ్యోమగాములు తిరిగొచ్చేందుకు ఈ సమస్య అడ్డంకి కాబోదని నాసా తెలిపింది. కానీ, ఈ సమస్యపై మరింత సమాచారం సేకరించాకే తాము వ్యోమగాములను తిరిగి భూమికి చేరుస్తామని నాసా స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments