Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా.. 4098 మంది మృతి

Webdunia
ఆదివారం, 7 జూన్ 2020 (14:52 IST)
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రపంచవ్యాప్తంగా శనివారం 122207 కొత్త కేసులు రావడంతో.. మొత్తం కేసుల సంఖ్య 69,62,528కి చేరాయి. అలాగే శనివారం 4098 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య నాలుగు లక్షలు దాటి.. 401544కి చేరింది. అలాగే దాదాపు 34.04 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు.
 
ఇక అమెరికాలో కొత్తగా 21975 కేసులొచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 19,87,683కి చేరాయి. అలాగే శనివారం 687 మంది మరణించడంతో.. మొత్తం మరణాల సంఖ్య 112077కి చేరింది. ఇక ఓవరాల్‌గా చూస్తే బ్రెజిల్, రష్యా, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, టర్కీ దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.
 
అలాగే భారత్ విషయానికి వస్తే.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొత్తగా భారత్‌లో 9887 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 236657కి చేరింది. అలాగే 20 గంటల్లో 294 మంది చనిపోయారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2: The Rule నటుడు శ్రీతేజ్ పెళ్లి చేసుకుంటానని మోసం: యువతి ఫిర్యాదు

ఫెస్టివల్స్ అనంతరం థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న వేదిక మూవీ ఫియర్

ఏఆర్.రెహ్మాన్ తండ్రిలాంటివారు... ఆ సంబంధం అంటగట్టొద్దు ప్లీజ్ : మోహిని డే

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments